Begin typing your search above and press return to search.
ఆ హీరోను పెళ్లి చేసుకొమని అబ్బాయిలు అడుగుతున్నారట!
By: Tupaki Desk | 12 Jun 2019 4:56 AM GMTఅతడో బాలీవుడ్ హీరో. సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించాడు. అయితేనేం.. ఇప్పుడాయనకు పెళ్లి ముచ్చట పెద్ద తలనొప్పిగా మారింది. అతగాడికి పెళ్లి ప్రపోజల్స్ అబ్బాయిల నుంచి రావటంతో నోట మాట రాని పరిస్థితి. తన పరిస్థితికి అతగాడు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోకు అబ్బాయిల నుంచి ప్రపోజల్స్ రావటం ఏమిటంటారా? ఏం చేస్తాం.. అతగాడు చేసిన వెబ్ సిరీస్ పుణ్యమా అని ఈ చిత్రమైన కష్టాలు ఆయన్ను చుట్టుముట్టాయి.
ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చిత్రంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాత్రను పోషించిన అర్జున్ మాథుర్ కు ఈ పరిస్థితి దాపురించింది. మేడ్ ఇన్ హెవెన్ అనే వెబ్ సిరీస్ లో నటించిన ఇతగాడికి.. ఆ వెబ్ సిరీస్ తర్వాత సిత్రమైన ఇమేజ్ సొంతమైంది. అందులో స్వలింగ సంపర్కుడిగా నటించాడు. దీంతో నెటిజన్ల నుంచి వస్తున్న పెళ్లి ప్రపోజల్స్ తో అతగాడి ఇన్ బాక్స్ నిండిపోతుందట.
తన వద్దకు నేరుగా వచ్చి మీరు గేనా అని ఎవరూ అడగటం లేదని.. కాకుంటే ఈ వెబ్ సిరీస్ తర్వాత అబ్బాయిల నుంచి అసభ్యకర సందేశాలు వస్తున్నాయని చెప్పారు. చాలామంది అబ్బాయిల నుంచి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ అడుగుతున్నారని వెల్లడించారు.
తన నటనకు ప్రశంసలు అందుతున్నప్పుడు ఆనందంగా ఉన్నా.. ఈ పెళ్లి ప్రపోజల్స్ ఏందంటూ అతగాడి ఆవేదన అంతా ఇంతా కాదు. తాను చెప్పదలుచుకున్నది ఒక్కటేనని.. నటించే పాత్రలను.. నిజ జీవితానని కలిపి చూడొద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు. అతగాడి ఆవేదన అర్థమైందిగా..?