Begin typing your search above and press return to search.
నన్ను వద్దన్న వారికి ఛాన్స్ ఇచ్చి వారిపై గెలిచా..!
By: Tupaki Desk | 14 Sep 2018 4:32 PM GMTయాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు - తమిళంలోనే కాకుండా మొత్తం సౌత్ లోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను దక్కించుకున్నాడు. సౌత్ లో స్టార్ యాక్షన్ చిత్రాల హీరోల్లో అర్జున్ ముందు వరుసలో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అర్జున్ తెలుగు మరియు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి సక్సెస్ లను దక్కించుకున్నాడు. పలు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసిన అర్జున్ తాజాగా తన 150వ చిత్రం ‘కురుక్షేత్రం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. అరుణ్ వైధ్యనాధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో శ్రీనివాస్ మీసాలా విడుదల చేస్తున్నాడు.
త్వరలో విడుదల కాబోతున్న కురుక్షేత్రం చిత్రం ప్రమోషన్ లో భాగంగా అర్జున్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వివరించాడు. తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను - ఛాన్స్ ల కోసం పడ్డ కష్టంను అర్జున్ చెప్పుకొచ్చాడు. పోలీస్ కావాలనుకున్న తాను అనుకోకుండా సినిమా ఛాన్స్ రావడంతో ఇండస్ట్రీకి వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. కన్నడంకు చెందిన నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది మంచి అవకాశాలు ఇచ్చారు. ఆ సమయంలోనే నన్ను కొందరు వ్యతిరేకించారు.
కన్నడ వ్యక్తిని ఎందుకు ఆధరించాలి అంటూ నాకు ఛాన్స్ లు ఇచ్చిన దర్శక నిర్మాతలతో నాముందే కొందరు అనడం జరిగింది. ఆ సమయంలో చాలా బాధ పడ్డాను. ఆ సమయంలో నన్ను తిరష్కరించిన వారికి నేను నిర్మించి, దర్శకత్వం చేసిన సినిమాల్లో ఛాన్స్ ఇచ్చాను. అలా వారిపై విజయాన్ని సాధించాను అంటూ అర్జున్ చెప్పుకొచ్చాడు. మొదటి నుండి కూడా గొడవలకు దూరంగా ఉంటూ - ఎప్పుడు వివాదాల జోలికి వెళ్లకుండా నేను కెరీర్ లో ముందుకు వెళ్తున్నాను అంటూ ఈ సందర్బంగా అర్జున్ చెప్పుకొచ్చాడు. ‘సేవగన్’ చిత్రాన్ని నమ్మి నేను ఆస్తులు అమ్మి మరీ నిర్మించాను. ఆ చిత్రం తెలుగులో పోలీస్ రౌడీగా విడుదల అయ్యింది. ఆ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకోవడంతో నేను నిలదొక్కుకోగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు. ‘కురుక్షేత్రం’ చిత్రంలో పోలీస్ పాత్రలో నటించిన అర్జున్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.