Begin typing your search above and press return to search.

ఏకంగా శంకర్‌ తో పోల్చేశాడే..

By:  Tupaki Desk   |   30 April 2018 10:52 AM GMT
ఏకంగా శంకర్‌ తో పోల్చేశాడే..
X
ఒక కొత్త దర్శకుడు భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళ్తాడని అతడితో పని చేసిన నటీనటులు చెప్పడం మామూలే. ఈ క్రమంలో కొంచెం పేరున్న దర్శకులతో పోల్చడం కూడా చేస్తుంటారు. ఐతే దక్షిణాది సినిమాను శిఖర స్థాయికి తీసుకెళ్లిన శంకర్‌ తో ఓ కొత్త దర్శకుడిని పోల్చడం మాత్రం సాహసమే అవుతుంది. యాక్షన్ కింగ్ అర్జున్.. ‘నా పేరు సూర్య’తో దర్శకుడిగా పరిచయం అవుతున్న వక్కంతం వంశీని అలాగే పోల్చేయడం విశేషం. వక్కంతం తనకు చాలా మంచి కథ చెప్పాడని.. ఇందులో తన పాత్ర కూడా అద్భుతంగా ఉంటుందని.. అయినప్పటికీ ఈ సినిమా చేయాలా వద్దా అని చాలా ఆలోచించానని.. ఐతే సినిమా పూర్తయ్యాక తాను ముందు ఎందుకంత ఆలోచించానా అనిపించిందని అర్జున్ చెప్పాడు. తన కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన పాత్ర అవుతుందని అతనన్నాడు.

పేపర్ మీద కథ రాయడం వేరు.. సినిమా తీయడం వేరు అని.. ఇవి రెండూ పూర్తి భిన్నమైన పనులని.. ఐతే వక్కంతం వంశీ ఎంత బాగా రాశాడో.. అంత బాగా తీశాడని.. అతను సినిమా తీసిన తీరు చూసి ఆశ్చర్యపోయానని.. ఎంతో సెన్సిబుల్ గా.. డీటైలింగ్ తో సినిమా తీశాడని కితాబిచ్చాడు అర్జున్. ఇదంతా చూస్తే ‘జెంటిల్మన్’ సినిమా సమయంలో శంకర్ ఎలా కనిపించాడో.. వక్కంతం తన తొలి సినిమా విషయంలో అలాగే కనిపించాడని అర్జున్ కొనియాడటం విశేషం. ఇక హీరో అల్లు అర్జున్ డెడికేషన్ అమోఘమని.. అంత అంకిత భావం ఉండబట్టే అతను ఈ స్థాయిలో ఉన్నాడని అన్నాడు. తాను సినిమాల కోసం ఎందుకింత కష్టపడతానో చెబుతూ.. ఇలా చేస్తేనే తన మార్కెట్ పెరుగుతుందని.. అప్పుడే గొప్ప గొప్ప టెక్నీషియన్లతో పని చేసే అవకాశం లభిస్తుందని చెప్పాడని.. ఇలా ఏ హీరో చెప్పగా చూడలేదని అర్జున్ అన్నాడు. తాను ముంబయి.. చెన్నై.. ఇలా చాలా నగరాలకు తిరుగుతుంటాని.. కొంత కాలంగా ఎక్కడ చూసినా తెలుగు సినిమా గురించే మాట్లాడుకుంటున్నారని అర్జున్ చెప్పడం విశేషం.