Begin typing your search above and press return to search.
#DRUGS విచారణ: ఆ `అర్జున్` నేను కాదంటూ బుర్ర తిరిగే జవాబిచ్చిన స్టార్ హీరో
By: Tupaki Desk | 24 Dec 2020 2:00 PM GMTమాదకద్రవ్యాల దుర్వినియోగంలో బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ రాంపాల్ పై ఎన్.సి.బి విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మీరు వెతుకుతున్న అర్జున్ నేను కాదంటూ అతడు ఇచ్చిన ట్విస్ట్ హాట్ టాపిక్ గా మారింది.
అర్జున్ రాంపాల్ ఇంటిపై ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండవసారి అతడిని ప్రశ్నించింది. అతడి నివాసంలో నిషేధిత మాత్రలు దొరికాయి. నవంబర్‌లో ఈ దాడి జరిగింది. నిషేధిత టాబ్లెట్ల కోసం ప్రిస్క్రిప్షన్ కూడా అతడు సమర్పించారని జాతీయ మీడియా నివేదించింది. అయితే తాజాగా వారు వెతుకుతున్న ‘అర్జున్’ నేను కాదని అర్జున్ రాంపాల్ ఎన్.సి.బికి చెప్పారు
తాజా నివేదిక ప్రకారం.. అర్జున్ రాంపాల్ బావమరిది అగిసిలాస్ డెమెట్రియేడ్స్ వాట్సాప్ లో `అర్జున్` అనే పేరుతో సంభాషణలు సాగాయని అది అతడేనని ఎన్సీబీ భావించింది. తన దర్యాప్తులో రాంపాల్ ఏజెన్సీకి వివరణ ఇచ్చారు. ఒక టాబ్లెట్ తన కుక్క కోసం అని చెప్పినట్టు ఒక వెట్ సైట్ పేర్కొంది. రెండవది తన సోదరి ఆందోళన చికిత్స కోసం SOS పేరిట ఉపయోగిస్తున్నారని దిల్లీకి చెందిన మానసిక వైద్యుడు సూచించారని తెలిపారట.
ఇదివరకూ అర్జున్ నివాసం నుండి ఎన్.సి.బి రెండు వేర్వేరు మాత్రలను స్వాధీనం చేసుకుంది. ఒకటి అల్ట్రాసెట్ (ట్రామాడోల్ అండ్ ఎసిటమినోఫేన్ కలిగి ఉన్న తీవ్రమైన నొప్పికి మితంగా చికిత్స చేయడానికి ఉపయోగించే ప్రిస్క్రిప్షన్ ఔషధం). రెండవ టాబ్లెట్ క్లోనాజెపామ్. ఇది నిర్భందించే రుగ్మతలు భయాందోళనలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. నిజానికి వీటిని ప్రిస్క్రిప్షన్ లేకుండా పుచ్చుకోకూడదు. ఈ రెండు టాబ్లెట్లను ఎన్డీపిఎస్ చట్టం క్రింద నిషేధించారు.