Begin typing your search above and press return to search.
మాఫియా 'డాడీ'గా ఇరగదీస్తున్నాడే
By: Tupaki Desk | 16 Jun 2017 7:10 AM GMTఅర్జున్ రాంపాల్ బాలీవుడ్ లో చాలా కాలం నుండి ఉన్నాడు. తన మొదటి సినిమా దీవానాపన్ తో మొదలుపెట్టినా మొదటి కమర్షియల్ బ్రేక్ మాత్రం షారుక్ ఖాన్ ‘ఓం శాంతి ఓం’ తో దక్కింది. రాక్ ఆన్ - హౌస్ ఫుల్ - రా.ఒన్ - డి-డే - రాయ్ లాంటి సినిమాలకు మంచి ఆదరణ వచ్చినా అర్జున్ రాంపాల్ మాత్రం సోలో హీరోగా హిట్ కొట్టలేక పోయాడు. ఇప్పుడు చాల కాలంగా వస్తుంది వస్తుందీ అంటూ ఊరిస్తున్న ‘డాడీ’ ట్రెయిలర్ రానేవచ్చింది. ఈ సినిమాతో అర్జున్ నటనకు మరోసారి బాలీవుడ్ అంతా బ్రహ్మరధం పడతారు అన్నడంలో ఎటువంటి సందేహం లేదేమో.
సినిమా విషయానికొస్తే.. అరుణ్ గావ్లీ.. సెంట్రల్ ముంబాయ్ లో ఒక చిన్న గ్యాంగ్ స్టార్ గా మొదలి పెట్టి రాజకీయ నాయకుడుగా ఎలా మారాడు అనే కథతో సినిమాను నిర్మించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది అరుణ్ గావిల్ ఆత్మ కథ. 70వ దశకంలో పరిస్థితులు వలన దాగ్ది చావల్ లో ఉండే వర్కర్స్ నెమ్మదిగా బొంబాయి అండర్ వరల్డ్ గా ఎలా మారుతారు. బాబు - రమ - అరుణ్ అనే ముగ్గురు కలిసి ఒక గ్యాంగ్ లా ఏర్పడి వాళ్ళు చేసిన పనులు వాటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది సినిమా. అర్జున్ రాంపాల్ అరుణ్ పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసినట్లు కనిపిస్తోంది. రాజకియ నాయకుడుగా మహా రాష్ట్ర వేషధారణ లో మరాఠీ హింది యాసలో జీవించాడు అర్జున్ రాంపాల్.
అరుణ్ గావ్లీ చించ్ పోక్లి MLA గా ఎలా ఎన్నుకోబడ్డాడు అనేది సినిమా కథాంశం. అర్జున్ రాంపాల్ అరుణ్ గా నటిస్తునాడు. నటుడు దర్శకుడు ఫరాన్ అక్తర్ - ఐశ్వర్యా రాజేశ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆశీమ్ అహ్లువాలియా డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు అర్జున్ రాంపాల్ కొ ప్రొడ్యూసర్ మాత్రమే కాదు.. కో-రైటర్ కూడాను.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/