Begin typing your search above and press return to search.

మీడియా అటెన్షన్‌ కోసం కమెడియన్‌ రేప్‌ ప్రకటన

By:  Tupaki Desk   |   21 Jan 2020 5:55 AM GMT
మీడియా అటెన్షన్‌ కోసం కమెడియన్‌ రేప్‌ ప్రకటన
X
అర్జున్‌ రెడ్డి చిత్రంతో కమెడియన్‌ గా మంచి గుర్తింపు దక్కించుకున్న నటుడు రాహుల్‌ రామకృష్ణ. ఈయన హీరోగానూ ప్రయత్నించాడు. హీరోగా సక్సెస్‌ కాలేక పోయినా కమెడియన్‌ గా మాత్రం మంచి హిట్స్‌ ను అందుకున్నాడు. భరత్‌ అనే నేను.. గీత గోవిందం ఇప్పుడు అల వైకుంఠపురంలో చిత్రాలతో కమెడియన్‌ గా తన స్థానంను మరింత పదిలం చేసుకున్నాడు. వరుసగా సక్సెస్‌ లు దక్కించుకుంటున్న రాహుల్‌ రామకృష్ణ తాజాగా సోషల్‌ మీడియాలో షాకింగ్‌ పోస్ట్‌ పెట్టాడు.

ఆ పోస్ట్‌ లో తాను చిన్నతనంలో రేప్‌ కు గురైనట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రతి ఒక్కరి జీవితంలో చేదు సంఘటనలు ఉంటాయి. వాటిని మర్చి పోయి ఆనందంగా జీవితంను జీవించేందుకు ప్రయత్నించాలి. నేను ప్రస్తుతం నా చిన్నతనపు జ్ఞాపకాలను వదిలేసి సంతోషంగా జీవిస్తున్నాను అన్నాడు. తనపై చిన్నతనం లో జరిగిన రేప్‌ గురించి ఈయన ఎక్కువగా రివీల్‌ చేయలేదు. ఇన్ని సంవత్సరాలకు తనను రేప్‌ చేశారంటూ ఈ కమెడియన్‌ చెప్పడం వెనుక ఉద్దేశ్యం ఏంటీ అంటూ సోషల్‌ మీడియాలో అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు.

రాహుల్‌ రామకృష్ణ కు ప్రస్తుతం మీడియాలో పబ్లిసిటీ కావాలి.. దానికోసమే ఇప్పుడు ఇలాంటి కామెంట్స్‌ చేస్తుంది అంటూ విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు. మరి కొందరు నీవు చాలా గ్రేట్‌.. ఎంతో మందికి నువ్వు ఆదర్శం అంటూ ప్రశంసించే వారు ఉన్నారు. మొత్తానికి రాహుల్‌ రామకృష్ణ రేప్‌ ప్రకటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అతడు అనుకున్నాడో లేదో కాని మీడియాలో మాత్రం ఈ విషయం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.