Begin typing your search above and press return to search.

చుట్టు తిరిగి మళ్లీ ఇక్కడకే

By:  Tupaki Desk   |   18 Feb 2020 4:09 AM GMT
చుట్టు తిరిగి మళ్లీ ఇక్కడకే
X
అర్జున్‌ రెడ్డి చిత్రం తో ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్‌ అయిన సందీప్‌ రెడ్డి వంగా అదే సినిమాను బాలీవుడ్‌ లో కబీర్‌ సింగ్‌ గా రీమేక్‌ చేశాడు. తెలుగులో ఎంత పేరైతే వచ్చిందో అంతకు మించి బాలీవుడ్‌ లో కూడా ఈయనకు వచ్చింది. ఇలాంటి సక్సెస్‌ లు పడ్డప్పుడు ఖచ్చితంగా అక్కడ సీనియర్‌ జూనియర్‌ హీరోలు అంతా కూడా ఆ దర్శకుడి దర్శకత్వంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తారు. కాని సందీప్‌ రెడ్డి దర్శకత్వం లో మాత్రం హిందీ హీరోలు నటించేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చుతున్నట్లుగా అనిపించడం లేదు.

బాలీవుడ్‌ లో వరుసగా రెండు మూడు ప్రాజెక్ట్‌ లను సందీప్‌ సెట్‌ చేశాడని పలువురు యంగ్‌ స్టార్స్‌ ఈయన దర్శకత్వంలో నటించేందుకు ఉవ్విల్లూరుతున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఇప్పటి వరకు ఈయన తదుపరి బాలీవుడ్‌ మూవీ సెట్‌ అవ్వలేదు. ఈయనకు టీ సిరీస్‌ వారు అడ్వాన్స్‌ ఇచ్చారు. కాని హీరోలు ఎవరు కూడా సెట్‌ అవ్వక పోవడంతో తెలుగు లో ఈయన తో సినిమాను నిర్మించేందుకు టీ సిరీస్‌ రెడీ అయినట్లుగా సమాచారం అందుతోంది.

తెలుగు హీరోతో సందీప్‌ వంగ దర్శకత్వంలో ద్వి భాష చిత్రాన్ని చేయాలని సదరు నిర్మాణ సంస్థ నిర్ణయించినట్లుగా సమాచారం అందుతోంది. తెలుగు మరియు హిందీ లో రూపొందబోతున్న ఆ చిత్రంలో హీరో ఎవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. తెలుగులో పలువురు యంగ్‌ హీరోలు సందీప్‌ రెడ్డి దర్శకత్వం లో నటించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. మరి ఇక్కడి హీరోతో అయినా వెంటనే సందీప్‌ మొదలు పెడతాడా చూడాలి. బాలీవుడ్‌ లో పలువురు హీరోల చుట్టు తిరిగిన సందీప్‌ చుట్టు తిరిగి మళ్లీ తెలుగు హీరోల వద్దకే వచ్చాడంటూ ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.