Begin typing your search above and press return to search.
అర్జున్ రెడ్డి ధైర్యం అది..
By: Tupaki Desk | 26 Aug 2017 11:15 AM GMTఒకసారి అర్జున్ రెడ్డి పోస్టర్ చూడండి.. అందులో సినిమా టైటిల్ ఇంగ్లిష్ లోనే కనిపిస్తుంది. ఏదో ఒక పోస్టర్ అని కాదు.. అన్ని పోస్టర్లలోనూ టైటిల్ అలాగే ఉంటుంది. సినిమా గురించి అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా టైటిల్ ను ఇంగ్లిష్ లోనే చూపిస్తోంది చిత్ర బృందం. థియేటర్ల ముందు అంటించిన పోస్టర్లలోనూ అంతే. ఇదేదో ఇంగ్లిష్ సినిమా అన్నట్లుగానే టైటిల్ ఆంగ్ల భాషకు పరిమితం చేసింది. దీన్ని బట్టే ప్రేక్షకులకు ‘అర్జున్ రెడ్డి’ టీం ఎలాంటి సంకేతాలిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లిష్ రాని ప్రేక్షకులు కూడా ఉంటారు కదా.. వాళ్లకు కూడా ఈ సినిమా చేరాలి కదా.. వాళ్లు కూడా సినిమాకు రావాలి కదా అన్న ఆలోచనే లేకుండా ఇంగ్లిష్ టైటిలే పెట్టడంలో ‘అర్జున్ రెడ్డి’ టీం ధైర్యాన్ని చూడొచ్చు.
ఒక్క టైటిల్ విషయంలోనే కాదు.. ‘అర్జున్ రెడ్డి’ టీం అప్రోచ్ ముందు నుంచి ఇలాగే ఉంది. ఫస్ట్ టీజర్లో పచ్చి బూతు వాడటం అయినా.. లిప్ లాక్ తో పోస్టర్లు రిలీజ్ చేయడమైనా.. తమ సినిమా గురించి మాట్లాడిన మాటలైనా.. ఏవైనా సరే వాళ్ల అగ్రెసివ్ అప్రోచ్ ను గమనించవచ్చు. దీన్ని బట్టే తమది బోల్డ్ సినిమా అన్న సంకేతాలు ఇచ్చేశారు. ప్రేక్షకుల్ని కూడా అందుకు ప్రిపేర్ చేశారు. ఇది ఓ వర్గం ప్రేక్షకులకే పరిమితం అయిపోతుందేమో అని ఎంత మాత్రం కంగారు పడలేదు. ఓ వర్గం ప్రేక్షకులే అయినా.. వాళ్లలో ప్రతి ఒక్కరూ సినిమా చూసి తీరాల్సిందే అన్న భావన కలిగించారు. ఈ సినిమా కోసం అర్బన్ యూత్ వెర్రెత్తిపోయేలా చేయగలిగారు. వాళ్ల అగ్రెసివ్ అప్రోచ్ బాగానే పని చేసింది. ‘అర్జున్ రెడ్డి’కి పిచ్చ క్రేజ్ తీసుకొచ్చింది. సినిమాలో కంటెంట్ కూడా బలంగా ఉండటంతో వసూళ్లు కూడా ఊహించని విధంగా ఉంటున్నాయి.