Begin typing your search above and press return to search.
‘అర్జున్ రెడ్డి’ టాప్-10లోకి వచ్చేశాడు
By: Tupaki Desk | 11 Sep 2017 6:21 AM GMTవిడుదలై రెండు వారాలు దాటినా ‘అర్జున్ రెడ్డి’ జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమా జోరుకు బ్రేకుల్లేవు. దీంతో పాటుగా రెండు సినిమాలు రిలీజైనా.. తర్వాతి రెండు వారాల్లో మూడు సినిమాలొచ్చినా.. అవేవీ ‘అర్జున్ రెడ్డి’ని ఆపలేకపోయాయి. మిలియన్ డాలర్ల అంచనాల్ని దాటేసి.. 1.5 మిలియన్ మార్కును కూడా దాలేసింది. యుఎస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 జాబితాలో పెద్ద సినిమాల సరసన చేరిపోయింది ‘అర్జున్ రెడ్డి. ప్రస్తుతం ఈ జాబితాలో ‘అర్జున్ రెడ్డి’ పదో స్థానానికి చేరుకోవడం విశేషం. నందమూరి బాలకృష్ణ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని వెనక్కి నెట్టేసి ఆ స్థానాన్ని అందుకుంది ‘అర్జున్ రెడ్డి’. ప్రస్తుతానికి ఈ చిత్ర వసూళ్లు 1.682 డాలర్లకు చేరుకున్నాయి.
‘బాహుబలి: ది కంక్లూజన్’ 20.57 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత వరుసగా ‘బాహుబలి: ది బిగినింగ్’ (6.99 మిలియన్లు).. శ్రీమంతుడు (2.89).. అఆ (2.449).. ఖైదీ నెంబర్ 150 (2.447).. ఫిదా (2.058).. నాన్నకు ప్రేమతో (2.022).. అత్తారింటికి దారేది (1.897).. జనతా గ్యారే్ (1.8) ఉన్నాయి. ఈ నెల 21న ‘జై లవకుశ’ వచ్చే వరకు ‘అర్జున్ రెడ్డి’ జోరు కొనసాగే అవకాశముంది కాబట్టి.. ఈ చిత్రం ఫుల్ రన్లో 2 మిలియన్ మార్కుకు చేరువగా వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.25 కోట్ల షేర్ మార్కును టచ్ చేసింది. ఫుల్ రన్లో రూ.30 కోట్ల షేర్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ చిత్ర థియేట్రికల్ హక్కుల్ని రూ.5.5 కోట్లకే అమ్మడం విశేషం.