Begin typing your search above and press return to search.

‘బాహుబలి’ బాటలో ‘అర్జున్ రెడ్డి’

By:  Tupaki Desk   |   19 Aug 2017 8:05 AM GMT
‘బాహుబలి’ బాటలో ‘అర్జున్ రెడ్డి’
X
‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమాను నైజాం ఏరియాలో పంపిణీ చేసిన ‘ఏషియన్’ సినిమాస్ వాళ్లే.. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కొత్త సినిమా ‘అర్జున్ రెడ్డి’ని పంపిణీ చేయడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సంస్థ రూ.5.5 కోట్లు పెట్టి హోల్ సేల్ గా ఈ సినిమాను కొనేసినట్లు వార్తలొచ్చాయి. విశేషం ఏంటంటే.. ‘బాహుబలి: ది కంక్లూజన్’ సినిమా విడుదలకు ఏషియన్ సినిమాస్ సంస్థ ముందు రోజు రాత్రి స్పెషల్ పెయిడ్ ప్రివ్యూలు వేసిన సంగతి తెలిసిందే. తమ ఆధ్వర్యంలో నడిచే ‘ఏషియన్’ గ్రూప్ థియేటర్లలో ఈ ప్రివ్యూలు వేసుకోగా.. మిగతా వాళ్లు కూడా వాళ్లను అనుసరించారు. ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ విషయంలోనూ అలాగే చేస్తోంది ‘ఏషియన్’ సంస్థ.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏషియన్ గ్రూప్ థియేటర్లలో ముందు రోజు ‘అర్జున్ రెడ్డి’ పెయిడ్ ప్రివ్యూలు వేస్తున్నారు. వచ్చే శుక్రవారం ఈ సినిమా విడుదలవుతుండగా.. గురువారం రాత్రి సెకండ్ షోను ప్రివ్యూగా వేస్తున్నారు. వీటికి ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెనయ్యాయి. ‘అర్జున్ రెడ్డి’ విడుదలయ్యే సమయానికి దానిపై ఎవరికీ అంత ఆసక్తి లేదు. కానీ ఇది మొదలయ్యాకే విజయ్ దేవరకొండ నటించిన ‘పెళ్లి చూపులు’ రిలీజై సూపర్ హిట్టయింది. దీనికి తోడు ‘అర్జున్ రెడ్డి’ టీజర్.. ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాకు మంచి హైప్ వచ్చింది. సందీప్ రెడ్డి వంగా స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించాడు. యాంగర్ మేనేజ్మెంట్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.