Begin typing your search above and press return to search.
ఇంత అవమానమా బాలా: షాక్
By: Tupaki Desk | 7 Feb 2019 12:24 PM GMTతెలుగులో ఇప్పటిదాకా వచ్చిన లవ్ స్టోరీస్ లో అర్జున్ రెడ్డిది చాలా ప్రత్యేకమైన స్థానం. బోల్డ్ అప్పీల్ తో దర్శకుడు సందీప్ వంగా తీర్చిదిద్దిన విధానం ఎందరో ఫిలిం మేకర్స్ కి స్ఫూర్తినిచ్చిన మాట వాస్తవం. అయితే ఇలాంటివి రీమేక్ చేయడం అంత సులభంగా ఉండదు. ఎంత గొప్ప దర్శకులైనా ఒరిజినల్ కథలోని ఆత్మను పసిగట్టకుండా గుడ్డిగా రీమేక్ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో దర్శకుడు బాలా రూపంలో ఓ సరికొత్త పాఠం పరిశ్రమ నేర్చుకోబోతోంది.
చియాన్ విక్రం వారసుడు ధృవ్ హీరోగా అర్జున్ రెడ్డి రీమేక్ వర్మ పేరుతో తమిళ్ లో బాలా తీస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ వచ్చినప్పటికీ నుంచి దీని మీద చాలా విమర్శలే వచ్చాయి. ట్రాలింగ్ గురించి చెప్పనక్కర్లేదు. అవి ప్రభావం చూపించాయో ఏమో మొత్తానికి నిర్మాణ సంస్థకే ఫస్ట్ కాపీ చూసాక చిర్రెత్తుకొచ్చిందట. ఇదేంటి అర్జున్ రెడ్డి తమిళ్ లో ఇలా తయారయ్యింది అనుకుని మొత్తాన్ని కాన్సిల్ చేసి రీ షూట్ చేయాలనీ నిర్ణయించుకున్నట్టు చెన్నై మీడియా టాక్.
దీనికి సంబంధించిన లెటర్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్స్ కు భిన్నంగా తనదైన శైలిలో శివపుత్రుడు-నేనే దేవుణ్ణి-వాడు వీడు లాంటి సినిమాలతో తెలుగు వాళ్ళకు సైతం బాగా సుపరిచితుడు అయిన బాలాకు ఇది ముమ్మాటికి చేదు అనుభవమే. ఇప్పుడు వచ్చిన కోలీవుడ్ టాక్ నిజమైతే సౌత్ లో ఇలా ఫస్ట్ కాపీ అయ్యాక నిర్మాత రిజెక్ట్ చేసిన అగ్ర దర్శకుడి సినిమా వర్మనే అవుతుంది.
దీని మీద బాలా కాని నిర్మాణ సంస్థ ప్రతినిధి కాని నేరుగా మీడియా మైకు ముందుకు అసలు విషయం బయట పడుతుంది. దర్శకుడు బాలాతో సహా టీం మొత్తాన్ని చేంజ్ చేయబోతున్న సదరు నిర్మాణ సంస్థ హీరో ధృవ్ ని మాత్రం కొనసాగించనుంది. అయితే సోషల్ మీడియాలో ధృవ్ మీద కూడా నెగటివ్ కామెంట్స్ చాలానే వచ్చాయి. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే రేపటి దాకా వేచి చూస్తే క్లారిటీ రావొచ్చు