Begin typing your search above and press return to search.

కొలీవుడ్ స్క్రాప్ ను అఖిల్ కు లింక్ పెట్టారే!

By:  Tupaki Desk   |   8 Feb 2019 7:52 AM GMT
కొలీవుడ్ స్క్రాప్ ను అఖిల్ కు లింక్ పెట్టారే!
X
ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఒక్కొకరి స్పందన ఒక్కోరకంగా ఉంటుంది. ఉదాహరణకు మనం రోడ్డుపై నడుస్తూ పోతుంటే కొత్తగా డ్యూకు బైకును కొన్నవాడు చెత్తగా డ్రైవ్ చేస్తూ మనకు డ్యాష్ ఇవ్వబోతుంటే మనం వెంటనే పక్కగు జరిగి తప్పించుకున్నాం అనుకోండి. దీనికి ఒకడు 'దెబ్బ తగల్లేదుగా'.. అంటూ తాపీగా నడుస్తూ వెళ్లి పోతాడు. మరొకరు అర్జున్ రెడ్డి లో విజయ్ దేవరకొండ లాగా 'మా ' అంటూ తిట్టి ఒకటి చేత్తో తగిలిస్తాడు. మరొకరు ' ముందు వెనక చూసుకొని డ్రైవ్ చెయ్' అని స్మూత్ గా మందలిస్తారు. అందరి రెస్పాన్స్ ఒకే రకంగా ఉండాలని అనుకోవడం మాత్రం అత్యాశే. ఇప్పుడు ఈ కథంతా ఎందుకంటే 'వర్మ' స్క్రాపింగ్ పై భిన్న స్పందనలు వ్యక్తం అవుతున్నాయి.

వర్మ అంటే గురుడు రామ్ గోపాల్ వర్మ కాదు. 'అర్జున్ రెడ్డి' తమిళ రీమేక్ 'వర్మ'. బాలా దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ను హీరో గా పరిచయం చేస్తున్న చిత్రమిది. సినిమా షూటింగ్ పార్ట్ అంతా అయిన తర్వాత అవుట్ పుట్ సరిగా లేదని మొత్తం సినిమాను స్క్రాప్ చేశారు. మళ్ళీ ఫ్రెష్ గా ధృవ్ హీరో గా మరో టీమ్ తో తెరకెక్కిస్తామని 'వర్మ' నిర్మాతలు తెలిపారు. సహజంగానే ఇది పెద్ద హాట్ టాపిక్ అయింది. దీనిపై ముందు ఉదాహరణ చెప్పుకున్నట్టు ఒక్కొకరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. అందులో కొందరు విక్రమ్ లా మన నాగార్జున స్పందించాలని అంటున్నారు!

బాలా టాలెంట్ గురించి అందరికీ తెల్సిందే. నేషనల్ అవార్డు విన్నింగ్ ఫిలిమ్స్ తీసిన ప్రతిభావంతుడు ఆయన. తప్పు ఆయనది కాదని.. అసలు ధృవ్ లాంచ్ ప్యాడ్ గా అలాంటి సినిమాను ఎంచుకోవడమే అసలు తప్పని అంటున్నారు. మరి కొందరు ఈ 'వర్మ' స్క్రాపింగ్ ను కోలీవుడ్ నుండి పట్టుకొచ్చి అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ మొదటి సినిమా 'అఖిల్' కు లింక్ పెట్టారు. 'వర్మ'ని స్క్రాప్ చేయాలనే ఆలోచన అసలు విక్రమ్ దేనని.. ఆ ఖర్చు తానే భరిస్తానని ముందుకొచ్చాడని.. నాగార్జున కూడా 'అఖిల్' ను చూడగానే అలాగే స్క్రాప్ చేసి ఉండాల్సిందని అంటున్నారు. అలా చేసి ఉంటే అఖిల్ పై ఈ నెగెటివిటి ఉండేది కాదని వారి భావన.

ఈ వెర్షన్ లో లాజిక్ లేదని కాదు. ఉంది.. కానీ ప్రతి సినిమాను ఇలా కనుక సినిమాలు స్క్రాప్ చేస్తూ పోతే దాదాపు 75% సినిమాలను టాలీవుడ్ ఫిలిం మేకర్స్ స్క్రాప్ చెయ్యాల్సిందే. ఇప్పుడేమో డెబ్యూ సినిమా కదా స్క్రాప్ చెయ్యండి అంటారు. తరవాత ప్రతిఫ్లాప్ సినిమాకు ఇదే సలహా ఇస్తారు. ఇండస్ట్రీలో కొంతమంది సీనియర్లు సినిమా చూడగానే ఇది హిట్టా ఫట్టా చెప్పేస్తారు. 12- 15% సక్సెస్ రేట్ ఉండే ఇండస్ట్రీలో ఇలా స్క్రాప్ చేసుకుంటూ పొతే వారానికి నాలుగు సినిమాలు కాదు. నాలుగు వారాలకు ఒక సినిమా రిలీజ్ కావడం కూడా కష్టమే. ఏంటో.. ఆ కోలీవుడ్ 'వర్మ'ను తీసుకొచ్చి ఇక్కడ నాగార్జునకు తగిలించడం!