Begin typing your search above and press return to search.
ఇక్కడి రెడ్డి.. అక్కడ వర్మ.. ప్చ్
By: Tupaki Desk | 11 Nov 2017 8:43 AM GMTటటైల్ తోనే క్రేజ్ రాబట్టాలని ఫిక్స్ అయిన తరువాత.. మనోళ్లు సినిమాలకు ఎలాంటి పేర్లయినా పెడతారు. పూరి జగన్ పోకిరి అని పేరు పెట్టి సినిమాను తీస్తే.. ఆ తరువాత పోరంబోకు అనే టైటిల్ తో కూడా ఒక సినిమా వచ్చింది. ఇప్పడు అదే తరహాలో 'అర్జున్ రెడ్డి' సినిమా తమిళ వర్షన్ చూస్తే మనకు అనిపించకమానదు. తెలుగులో క్రియేట్ చేసిన బజ్ అక్కడ కూడా చేయాలంటే.. టైటిల్ చాలా ముఖ్యం అనుకున్నట్లున్నారు.
నిజానికి అర్జున్ రెడ్డి సినిమాలో హీరో పేరు.. అర్జున్ రెడ్డి దేశ్ముఖ్. మరి 'రెడ్డి' అనే ట్యాగుతో ఇక్కడ తెగ హడావుడి చేసి.. సినిమాలో అది క్యాస్ట్ పేరు కాదన్నట్లు హింటిచ్చి.. భలే మ్యాజిక్ చేశారు ఇక్కడ మేకర్లు. అందుకే ఈ సినిమాను తమిళంలో విక్రమ్ కొడుకు ధృవ్ తో తీస్తున్న దర్శకుడు బాలా కూడా.. ఏదన్నా అలాంటి ట్యాగే కోరుకున్నాడట. దానితో అక్కడ ఈ సినిమాకు 'వర్మ' అనే టైటిల్ పెట్టారు. మరి తమిళనాటు ఈ కులంతోక పాపులరా కాదా తెలియదు కాని.. వర్మ అనే టైటిల్ తో నానా హంగామా జరుగుతోంది ఇప్పుడు.
విక్రమ్ కొడుకును హీరోగా దించుతున్నప్పుడు.. చియాన్ అని పెడితే బాగుంటుంది కాని.. ఇలా ఎవ్వరికీ అర్దంకాకుండా వర్మ ఏంటి అంటూ వారు షాకవుతున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ కారణంగా ఆ పేరు బాగా పాపులర్ అయ్యింది అనుకుందాం అంటే.. మనోడు తమిళంలో పెద్దగా పాపులర్ కాదాయే.