Begin typing your search above and press return to search.
అర్జున్ రెడ్డి సారీ చెప్పాడు
By: Tupaki Desk | 23 Aug 2017 4:53 PM ISTనేను సారీ చెప్పడమా.. ఛాన్సే లేదు అంటూ.. ‘ఎఫ్’ వర్డ్స్ కూడా వాడాడు ‘అర్జున్ రెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆ చిత్ర హీరో విజయ్ దేవరకొండ. ఆ వేడుకలో అతను ఎంత అగ్రెసివ్ గా మాట్లాడాడో తెలిసిందే. పనిలో పనిగా ఎవరి వద్దా తల వంచకండి.. అణకువ ప్రదర్శించకండి.. దూకుడుగానే ఉండండంటూ ఈ వేడుకకు హాజరైన యువతను ఉద్దేశించి లెక్చర్లు కూడా దంచాడు విజయ్. దీని కంటే ముందు ఈ సినిమా పోస్టర్లను చించేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును ఉద్దేశించి ‘తాతయ్యా.. చిల్’ అని విజయ్ అనడం కూడా గుర్తుండే ఉంటుంది. ఐతే అప్పుడలా చేసి.. ఇప్పుడు విజయ్ అండ్ కో జనాలకు సారీ చెప్పింది.
లిప్ లాక్స్ తో ఉన్న ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ల విషయంలో వ్యతిరేకత మరింత పెరగడం.. మహిళా సంఘాలు.. బీసీ యువజన సంఘం ‘అర్జున్ రెడ్డి’ టీంకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘అర్జున్ రెడ్డి’ టీం స్ట్రాటజిగ్గా సారీ చెప్పినట్లు కనిపిస్తోంది. పోస్టర్ల కంటే కూడా ఈ వివాదం వల్లే ఎక్కువ పబ్లిసిటీ వస్తుందన్న ఉద్దేశంతో వాళ్లు సారీ చెప్పినట్లు భావిస్తున్నారు. సారీకే పరిమితం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ లిప్ లాక్ పోస్టర్లన్నింటినీ కూడా తొలగించేస్తున్నట్లు ప్రకటించి చిత్ర బృందం. ఈ పోస్టర్ల చించివేత చర్చనీయాంశంగా మారి.. సినిమా పబ్లిసిటీకి బాగా కలిసొస్తుందని విజయ్ అండ్ టీం భావిస్తున్నట్లుగా ఉంది. మొత్తానికి మొదట్నుంచి కాంట్రవర్శల్ వేలోనే సినిమాన ప్రమోట్ చేసుకుంటూ వస్తున్న ‘అర్జున్ రెడ్డి’ టీం.. విడుదలకు ముందు కూడా అదే బాటను అనుసరిస్తోంది. మున్ముందు చాలామంది పబ్లిసిటీ కోసం ఈ మోడలే అనుసరించినా అనుసరిస్తారేమో.