Begin typing your search above and press return to search.

చిన్నవాడా సెంటిమెంట్ కలిసొస్తుందా?

By:  Tupaki Desk   |   11 Oct 2019 6:20 AM GMT
చిన్నవాడా సెంటిమెంట్ కలిసొస్తుందా?
X
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'అర్జున్ సురవరం' షూటింగ్ పూర్తయి చాలారోజులే అయినా రిలీజ్ విషయంలో అనుకోని ఇబ్బందులు ఎదురుకావడంతో పలుమార్లు వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను నవంబర్ 8 న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి 'అర్జున్ సురవరం' థియేటర్లలోకి రావడం పక్కా అని.. ఈసారి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నిఖిల్ సిద్ధార్థకుఒక పాజిటివ్ సెంటిమెంట్ కూడా ఉంది. నిఖిల్ కెరీర్ లో మంచి విజయం సాధించిన చిత్రంగానే కాకుండా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రంగా నిలిచింది 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'. ఈ సినిమా విడుదలైంది నవంబర్ నెలలోనే. దీంతో నిఖిల్ మరోసారి 'అర్జున్ సురవరం' తో హిట్ కొడతాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ సినిమా కంటెంట్ కూడా బలమైనది కావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర నిఖిల్ సినిమాకు మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కనిదన్' సినిమాకు రీమేకే ఇది. 'వాల్మీకి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అథర్వ ఒరిజినల్ సినిమాలో హీరో. తమిళ వెర్షన్ కు దర్శకత్వం వహించిన టీ.ఎన్ సంతోష్ తెలుగు వెర్షన్ కు కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.