Begin typing your search above and press return to search.
వావ్.. నితిన్ విలన్ గా అర్జున్
By: Tupaki Desk | 16 Jan 2017 3:43 PM GMTఒకప్పటి హీరోలందరూ విలన్లుగా.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్న రోజులివి. మన జగపతిబాబు ‘లెజెండ్’ సినిమాతో విలన్ అవతారంలోకి మారి ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో.. ఎంత బిజీ అయ్యాడో తెలిసిందే. ఇప్పుడు జగపతి మిత్రుడైన మరో సీనియర్ హీరో కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ఆ నటుడు మరెవరో కాదు.. అర్జున్. ఒకప్పుడు తమిళ.. తెలుగు భాషల్లో హీరోగా మంచి స్థాయిలో కొనసాగిన అర్జున్.. గత కొన్నేళ్లుగా లైమ్ లైట్లో లేడు. చివరగా ‘రామరామ కృష్ణ కృష్ణ’ సినిమాలో కనిపించిన అర్జున్ ను తెలుగు ప్రేక్షకులు దాదాపు మరిచిపోయారు. ఇలాంటి సమయంలో అర్జున్ ఓ క్రేజీ ప్రాజెక్టుతో రీఎంట్రీ ఇస్తున్నాడు.
‘అందాల రాక్షసి’.. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన హను రాఘవపూడి.. నితిన్ హీరోగా 14 రీల్స్ బేనర్లో ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అర్జున్ విలన్ పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించింది చిత్ర బృందం. తాను ఇప్పటిదాకా రాసిన బెస్ట్ క్యారెక్టర్స్ లో ఇదొకటంటూ అర్జున్ పాత్ర గురించి చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పాడు హను. అర్జున్ తప్ప మరొకరు ఈ పాత్ర చేయలేరని.. ఆయన ఒప్పుకోకుంటే ఈ పాత్రను ఎవరికివ్వాలో కూడా తనకు అర్థమయ్యేది కాదని అతను వ్యాఖ్యానించాడు. మరి అర్జున్ పాత్రలో అంత ప్రత్యేకత ఏముందో.. అతడీ పాత్రలో ఎలా మెప్పిస్తాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/