Begin typing your search above and press return to search.

కంటెంట్ తో కుమ్మేస్తామంటున్న యంగ్ బ్లడ్

By:  Tupaki Desk   |   10 Nov 2021 11:30 PM GMT
కంటెంట్ తో కుమ్మేస్తామంటున్న యంగ్ బ్లడ్
X
కంటెంట్ ఉంటేనే ఎంతటి కటౌట్ కి అయినా సెల్యూట్ చేస్తారు. సినిమాల్లో లాజిక్ అడగొద్దు అంటారు కానీ మారుతున్న కాలానికి తగినట్లుగా మూవీస్ లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకనాడు సినిమా అంటే నాటకానికి నమూనాగా ఉండేది. తరువాత రోజుల్లో కుటుంబ కధలే సినిమాగా మారిపోయాయి. ఇక యాక్షన్, ఫిక్షన్, మాస్ అన్ని రకాలుగా దట్టించిన మసాల్తో మూవీస్ వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసి పడేశాయి.

కొందరు హీరోలు, దర్శకులు కలసి సినిమాకు కమర్షియల్ కొలతలు కూడా తెచ్చిపెట్టారు. ఆరు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటే సినిమా అన్న కొలమానంతో దశాబ్దాల కధ సాగిపోయింది. అయితే టాలీవుడ్ లో కంటే కోలీవుడ్ సహా ఇతర భాషల పరిశ్రమలలో రియల్ స్టోరీస్ తో సినిమాలు ఎక్కువగా వస్తాయన్నది కూడా ప్రచారంలో ఉంది. సామాజిక ఇతి వృత్తాల మీద ఆఫ్ బిట్ మూవీస్ 80 దశకం దాకా తెలుగులో వచ్చినా ఆ తరువాత కమర్షియల్ వెల్లువలో కొట్టుకుపోయాయి.

అయితే ఇపుడిపుడే మళ్ళీ మార్పు వస్తోంది. నాన్ కమర్షియల్ ఫార్మెట్ కి ఆదరణ దక్కుతోంది. ఒకనాడు ప్రయోగాలు అని జడిసిన మేకర్సే ఇపుడు వాటిని ప్రమాణంగా తీసుకుంటున్నారు. దీంతో తెలుగు సినిమాలో మంచి కంటెంట్ తో మూవీస్ తయారవుతున్నాయి. దానికి యువ హీరోలే పెద్ద పీట వేస్తున్నారు. సత్యదేవ్ వంటి హీరోలు ఇలా కంటెంట్ ని నమ్ముకునే హీరోలమనిపించుకుంటున్నారు. సత్యదేవ్ లేటెస్ట్ మూవీ స్కైలాబ్ ఈ కోవలోకి చెందినదే. ఈ మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి.

అలాగే శ్రీ విష్ణు కూడా రాజరాజ చోర హిట్ తరువాత జోరు పెంచేశారు. ఆయన లేటెస్ట్ మూవీ అర్జున ఫల్గుణ కూడా మంచి మాస్ కంటెంట్ తో ముందుకు వస్తోందిట. ఇదే బాటలో మరింతమంది హీరోలు కూడా నడుస్తున్నారు. సినిమాలో విషయం లేకపోతే జనాలు తిప్పికొడుతున్న రోజులు ఇవి. గ్లామర్ తో హీరోయిజంతో మూవీని కదిలించే రోజులు మారుతున్నాయి.రానున్న కాలంలో కంటెంట్ మూవీస్ జోరందుకుంటే టాప్ స్టార్స్ తో పాటు అంతా ఇదే బాట పట్టాల్సిందే అంటున్నారు. జనాల మొగ్గు ఎటు వైపు ఉంటే అదే హిట్ అవుతుంది. అదే కమర్షియల్ ఫార్ములా అవుతుంది.