Begin typing your search above and press return to search.

'అర్జున ఫల్గుణ' లో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కోసం..!

By:  Tupaki Desk   |   16 Nov 2021 11:30 PM GMT
అర్జున ఫల్గుణ లో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కోసం..!
X
యంగ్‌ హీరోలు ఈమద్య కాలంలో తమలోని ట్యాలెంట్‌ ను చూపించేందుకు అన్ని రకాల పాత్రలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం హీరోగా మాత్రమే నటించకుండా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తమ ప్రతిభను చూపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ హీరోల జాబితాలో ముందు ఉంటాడు శ్రీ విష్ణు. ఆయన హీరోగానే కాకుండా విభిన్నమైన పాత్రల్లో కూడా నటించాడు. కంటిన్యూగా సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో ఎప్పుడు కూడా నిలిచే శ్రీవిష్ణు త్వరలో అర్జున ఫల్గుణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా ఆయన విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా టీజర్ మరియు ఫస్ట్‌ లుక్ చూస్తుంటే అర్థం అవుతోంది.

విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న శ్రీ విష్ణు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కు వీరాభిమానిగా కనిపించబోతున్నాడు. ఈమద్య కాలంలో యంగ్‌ హీరోలు.. కొత్త హీరోలు తమ సినిమాల్లో స్టార్‌ హీరోలను చూపిస్తున్నారు. తద్వార సినిమాకు మంచి బజ్ రావడంతో పాటు ఆ హీరో అభిమానులు సోషల్‌ మీడియాలో తమ సినిమాను ప్రచారం చేస్తారనే ఉద్దేశ్యంతో మేకర్స్‌ ఈ నిర్ణయంను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో ప్రస్తుతం అర్జున ఫల్గుణ సినిమా గురించి ఎన్టీఆర్‌ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా లో శ్రీ విష్ణు ఎన్టీఆర్ కు అభిమానిగా కనిపించబోతున్నాడు. సినిమా లో ఎన్టీఆర్‌ పేరును పలు సందర్బాల్లో ప్రస్థావిస్తారట. అందుకే అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు.

ఈ సినిమా లో ఎన్టీఆర్‌ అభిమానిగా శ్రీ విష్ణు కనిపించి జై ఎన్టీఆర్‌ అంటూ చేసిన సన్నివేశాలు.. ఎన్టీఆర్‌ సినిమాల విడుదల హడావుడి  సీన్స్ కూడా అర్జున ఫల్గుణ లో ఉంటాయట. సినిమాకు ఆ సన్నివేశాలు ప్రథాన ఆకర్షణగా ఉంటాయని మేకర్స్ అంటున్నారు. ఖచ్చితంగా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో శ్రీ విష్ణు ఉన్నాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో శ్రీ విష్ణు కు జోడీగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఫేమ్‌ అమృతా అయ్యర్‌ హీరోయిన్‌ గా నటించింది. వీరిద్దరి కాంబో సన్నివేశాలు కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయని చెబుతున్నారు. ఒక మంచి గోదావరి కథ.. పల్లెటూరు నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు.