Begin typing your search above and press return to search.
'అర్జున ఫల్గుణ' ఓటీటీ అప్డేట్
By: Tupaki Desk | 1 Jan 2022 2:30 AM GMTశ్రీ విష్ణు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా రూపొందిన అర్జున ఫల్గుణ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు నుండే సోషల్ మీడియాలో మంచి బజ్ ను క్రియేట్ చేయడంలో సఫలం అయ్యింది. కనుక ఈ సినిమా విడుదల కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఇక ఈ సినిమా ఓటీటీ స్క్రీనింగ్ గురించిన విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఈమద్య కాలంలో చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కూడా ఓటీటీ లో మంచి బిజినెస్ చేస్తుంది.
అర్జున ఫల్గుణ సినిమాకు వచ్చిన బజ్ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ లు ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి అంటూ వార్తలు వస్తున్నాయి. అందులో అమెజాన్ వారికి ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. శ్రీ విష్ణు నటించిన ఈ సినిమా ను ఓటీటీ లో ఎప్పుడు స్ట్రీమింగ్ చేసే విషయమై క్లారిటీ లేదు. కాని ఈమద్య కాలంలో ఎక్కువ శాతం సినిమాలు థియేటర్ రిలీజ్ అయిన తర్వాత నాలుగు వారాలకు అంటే సరిగ్గా నెల రోజులు కూడా తిరగకుండానే ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా అదే తరహా లో వస్తుందని కొందరు అంటున్నారు. మరి అఫిషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావాల్సి ఉంది.
శ్రీ విష్ణు కథల ఎంపిక విషయంలో చాలా ఆచి తూచి వ్యవహరిస్తూ ఉంటాడు. తనను తాను హీరోగా ఎలివేట్ చేసుకోవడం కు కాకుండా ఒక మంచి సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన కథలను ఎంపిక చేసుకుంటూ ఉంటాడు అనేది ఒక టాక్ ఉంది. కనుక అర్జున ఫల్గుణ కూడా అదే తరహా లో ఉంటుందని అంతా నమ్మకంగా ఉన్నారు. సినిమా విడుదల నేపథ్యంలో యూనిట్ సభ్యులు పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహించారు. వచ్చే వారంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల ఉంది. కనుక ఈ వారం రోజుల్లోనే సాధ్యం అయినంతగా ఈ సినిమా వసూళ్లు చేయాల్సి ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ వచ్చిన తర్వాత ఈ సినిమా ను జనాలు పట్టించుకోవడం కష్టమే.