Begin typing your search above and press return to search.
సుశాంత్ పేరుతో తన్నుకు చస్తున్న టీవీ చానల్స్
By: Tupaki Desk | 3 Aug 2020 1:00 PM GMTసుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం రకరకాల డిబేట్లకు కారణమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రముఖ మీడియాలు రెండు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు తీర్పు వెలువరిస్తున్నారు. ఇందులో ఎన్డీటీవీ లాంటి ప్రముఖ చానెల్ బాలీవుడ్ పెద్దల్ని సమర్థిస్తుంటే.. అందుకు పూర్తి వ్యతిరేక కథనాలతో రిపబ్లిక్ టీవీ అట్టుడికిస్తోంది. బాలీవుడ్ మాఫియాపై తీవ్రంగా ఆరోపిస్తూ రిపబ్లిక్ టీవీ లో అర్నాబ్ గోస్వామి సంచలన కథనాల్ని వెలువరించారు. ఇక ఆయనకు కౌంటర్ గా బాలీవుడ్ పెద్దలందరినీ వెనకేసుకొస్తూ సర్ధీప్ రాజ్ దేశాయ్ కథనాలు అంతే వేడెక్కిస్తున్నాయి.
ఇదొక వార్ లా మారింది. రెండు వర్గాలు ఎవరికి వారు తీర్పు ఇచ్చేస్తుంటే ఆ రెండిటినీ తిట్టేవాళ్లు లేకపోలేదు. ఓవైపు కోవిడ్ వార్తలు మరోవైపు సుశాంత్ సింగ్ బలవన్మరణంపై దర్యాప్తునకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం ప్రధాన టీఆర్పీ గేమ్ గా మారాయి. చానెళ్ల వ్యవహారాన్ని తిట్టేవాళ్లే కానీ పొగిడేవాళ్లు లేనే లేరు.
ఇక ఈ టీవీ చానెల్ డిబేట్లతో హడలిపోయిన సుశాంత్ గాళ్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ఎవరికీ కనిపించకుండా దాక్కున్న సంగతి తెలిసిందే. ఆవిడ దాక్కుంది! అంటూ కథనాలు వేస్తూ వేడెక్కించేస్తున్నాయి జాతీయ చానెళ్లు. ఇక మెజారిటీ హిందీ చానెళ్లు రిపబ్లిక్ టీవీకి వ్యతిరేక కథనాల్నే వండి వారుస్తున్నాయి. సుశాంత్ స్నేహితులు.. కుటుంబం .. మాజీ ప్రేయసి అంకిత... సుశాంత్ కి ట్రీట్మెంట్ చేసిన సైక్రియాటిస్ట్ సహా పలువురు టీవీ డిబేట్ ల పేరుతో నలిగిపోతున్నారు.
ఇటీవల ముంబై పోలీసులు బీహార్ పోలీసులతో సహకరించకపోవడంపై రిపబ్లిక్ టీవీ చానెల్ కథనం అందరి దృష్టిని ఆకర్షించింది. బర్ఖా దత్ నేతృత్వంలోని ఎన్డీటీవీ.. రాజ్దీప్ సర్దేసాయి నేతృత్వంలోని ఇండియా టుడే అర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టివి ప్రసారం చేస్తున్న కథనాలు ప్రస్తుతం హాట్ డిబేట్ గా మారాయి.