Begin typing your search above and press return to search.
టెర్మినేటర్ దొబ్బినందుకు ఆర్నాల్డ్ ఆనందం
By: Tupaki Desk | 9 April 2015 3:30 AM GMTఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ అనగానే అందరికీ టెర్మినేటర్ సినిమానే గుర్తుకొస్తుంది. 1984లో వచ్చిన తొలి పార్ట్ హాలీవుడ్‌లో పెద్ద సంచలనం. ఈ సినిమాతో రాత్రికి రాత్రే ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత టెర్మినేటర్ సిరీస్‌లో ఆర్నాల్డ్ నటించిన ది జడ్జిమెంట్ డే, రైజ్ ఆఫ్ ద మెషీన్స్ కూడా సూపర్ హిట్టయి.. ఆర్నాల్డ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఐతే సిరీస్‌లో వచ్చిన నాలుగో సినిమా 'సాల్వేషన్'లో ఆర్నాల్డ్ లేడు. ఆ సినిమా తీసే సమయానికి రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాలిఫోర్నియా గవర్నర్ పదవిలో బిజీ అయిపోయాడు ఆర్నాల్డ్.
దీంతో ఆర్నాల్డ్ స్థానంలో క్రిస్టియన్ బాలె హీరోగా నటించాడు. కానీ ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ అయింది. ఆర్నాల్డ్ లేకపోవడమే ఫ్లాప్ అయిందని కొందరు.. కంటెంట్ బాలేకపోవడమే కారణమని ఇంకొందరు వాదించారు. ఐతే ఇప్పుడు టెర్మినేటర్ సిరీస్‌లో వస్తున్న ఐదో సినిమాలో మాత్రం ఆర్నాల్డే హీరో. ఈ సినిమా పేరు.. జెనిసిస్. ఈ ఏడాది నవంబర్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. మళ్లీ టెర్మినేటర్ సిరీస్‌లో నటిస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆర్నాల్డ్.. సాల్వేషన్‌లో తాను లేకపోవడం పట్ల చాలా సంతోషించాడు. ఆ సినిమాలో నటించకపోవడం గురించి స్పందిస్తూ.. ''థ్యాంక్ గాడ్.. ఇట్ సక్డ్'' అంటూ షాకింక్ కామెంట్ చేశాడు ఆర్నాల్డ్. ఒకవేళ జెనిసిస్ ఫ్లాప్ అయితే క్రిస్టియన్ బాలె కూడా ఇలాగే రెస్పాండయితే ఆర్నాల్డ్ ఫీలింగ్ ఎలా ఉంటుందో?