Begin typing your search above and press return to search.

అరెస్ట్ వారెంట్ వార్త‌లు.. మీడియాని ఎగ‌తాళి చేసిన శంక‌ర్!

By:  Tupaki Desk   |   2 Feb 2021 5:56 AM GMT
అరెస్ట్ వారెంట్ వార్త‌లు.. మీడియాని ఎగ‌తాళి చేసిన శంక‌ర్!
X
రోబో (ఎంథీర‌న్) మూవీకి మూవీకి సంబంధించిన దశాబ్దాల కేసులో స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింద‌ని త‌మిళ మీడియా స‌హా ఇత‌ర మీడియాల్లోనూ క‌థ‌నాలు రావ‌డం ఇటీవ‌ల సంచ‌ల‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఆయన న్యాయవాది విఫలమయ్యారని దీంతో బెయిల్ ఇవ్వని వారెంట్ జారీ అయ్యింద‌ని క‌థ‌నాలు వేడెక్కించాయి.

గౌరవనీయ ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందనే తప్పుడు వార్తలను చూసి తాను షాక్ కి గుయ్యానని శంకర్ తాజాగా పత్రికా ముఖంగా ప్ర‌క‌ట‌న జారీ చేయ‌డం త‌మిళ‌నాట హాట్ టాపిక్ గా మారింది.

శంకర్ న్యాయవాది మిస్టర్ సాయి కుమారన్ ఈ రోజు కోర్టును ఆశ్రయించారని ఈ వార్తలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారని వారెంట్ ఏదీ జారీ చేయలేదని వివ‌ర‌ణ ఇచ్చారు. రిపోర్టింగులో ఏదైనా పొర‌పాటు జ‌రిగి ఉండొచ్చ‌ని ఆయ‌న అన్నారు. ప్రస్తుతం ఇది సరిదిద్దార‌ని తెలిపారు. అరెస్ట్ వారెంట్ పుకార్లతో శంకర్ తీవ్రంగా కలత చెందార‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. అయినా ఎలాంటి అధికారిక‌ ధృవీకరణ లేకుండా తప్పుడు క‌థ‌నాలు ప్ర‌చారం చేయడాన్ని త‌ప్పు ప‌ట్ట‌డ‌మే గాక శంక‌ర్ ఎగతాళి చేశారు. ఏదేమైనా ఈ ప్రచారం అతని కుటుంబానికి శ్రేయోభిలాషులకు వేదన కలిగించింది. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయకుండా ఉండాలని శంకర్ మీడియాను వేడుకున్నాడు.

సూప‌ర్ స్టార్ రజనీకాంత్ - ఐశ్వర్య రాయ్ నాయ‌కానాయిక‌లుగా నటించిన రోబో (ఎంథీర‌న్) 1996 లో రిలీజైంది. ఇది ఓ చిట్టి కథ `జిగుబా` నుండి కాపీ చేయబడిందని కథా రచయిత అరుళ్ తమిళనందన్ ఆరోపించారు. ఆ త‌ర్వాత ఆ వివాదం అప‌రిష్కృతంగానే ఉండిపోయింది.