Begin typing your search above and press return to search.
సైరా.. కోట్ల ఖరీదు చేసే అప్ డేట్స్
By: Tupaki Desk | 4 Sep 2017 4:28 AM GMTమెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ సైరా నరసింహారెడ్డి. తన కంబ్యాక్ మూవీతో కమర్షియల్ సినిమాను 100 కోట్ల మార్క్ దాటించిన మెగాస్టార్ ఇప్పుడు అంతకు రెండింతలు ఖర్చు చేస్తూ.. మూడింతల వసూళ్లపై కన్నేశారు. ఇందుకోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ను తెరకెక్కించనుండగా.. మెగాస్టార్ బర్త్ డే రోజున మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు క్యాస్ట్ అండ్ క్రూ కూడా పరిచయం చేశారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2 శతాబ్దాలకు పూర్వం చరిత్రను చెప్పాల్సి ఉండడంతో.. సెట్స్ నిర్మాణం జరుగుతోంది. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్.. అలనాటి కాలానికి చెందిన సెట్స్ ను ఆవిష్కరించేందుకు బోలెడంత కష్టపడుతున్నారు. "అప్పటి కాలానికి చెందిన రిఫరెన్స్ లు ఏమీ లేవు. బ్రిటిష్ పాలన.. తొలి స్వతంత్ర సమరానికి ముందు కాలం నాటి సెట్స్ వేయాల్సి ఉంది. కేవలం స్కెచ్ ల పైనే 15 మంది పని చేస్తుండగా.. పలు పుస్తకాలు.. వీడియోలు.. చరిత్రకారుల నుంచి రిఫరెన్స్ లు తీసుకుంటున్నాం" అని రాజీవన్ చెప్పారు.
హైద్రాబాద్.. పొలాచ్చి.. రాజస్థాన్ లతో పాటు పలు ప్రాంతాలలో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. అయితే.. ఇవి చాలా గ్రాండ్ గా ఉంటాయని మినహాయిస్తే.. మరే ఇతర వివరాలను చెప్పలేనని అంటున్నారు రాజీవన్. కానీ సైరా లో నటించే నటీనటులు.. టెక్నీషియన్స్ కే కాకుండా.. కేవలం ఈ సెట్స్ కే చాలా కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారట.