Begin typing your search above and press return to search.
బాప్ రే.. ట్రెడ్ మిల్ కే అలుపొచ్చేలా ఏంటిదీ మ్యాడమ్!
By: Tupaki Desk | 15 July 2021 11:43 AM GMTతెలుగు సినీపరిశ్రమలో నటి ప్రగతి సుదీర్ఘ కాలం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించి మంచి గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. నవతరం హీరోలకు మదర్ గా సిస్టర్ గా ఆమె ఎక్కువగా నటించారు. వదిన..అత్త పాత్రల్లోనూ ప్రేక్షకులకు మైమరిపించారు. వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ నటనలో తనదైన మార్క్ చూపిస్తుంటారు.
ప్రస్తుతం ఆమె వయసు 45. కానీ తన రూపాన్ని మార్చుకునేందుకు నిరంతరం జిమ్ లో ఎంతగా శ్రమిస్తున్నారో చూస్తున్నదే. వర్కవుట్ల విషయంలో నవతరం ఫ్యాషనిస్టాలకు ఏమాత్రం తీసిపోనని నిరూపిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రగతి జిమ్ లో నిరంతరం కసరత్తులు చేసిన వీడియోల్ని షేర్ చేయగా అంతర్జాలాన్ని షేక్ చేశాయి.
ప్రగతి కఠోర శ్రమ చూసి నెటిజనులు ముక్కున వేలేసుకున్నారు. లేట్ ఏజ్ లోనూ ప్రగతి నేటి హీరోయిన్లను మించి వర్కౌట్లు చేస్తున్నారు. ఇప్పటికే బెల్లీ తగ్గించేందుకు ప్రత్యేక వర్కౌట్స్ చేసి ఔరా అనిపించిన ఆమె తాజాగా ట్రెడ్ మిల్ పై రివర్స్ గేర్ లో కసరత్తులు చేస్తూ వావ్ అనిపించారు.
అంతా ట్రెడ్ మిల్ పై జాగింగ్ చేస్తుంటారు. కానీ ఈ సీనియర్ నటి మాత్రం రివర్స్ లో చేతులతో నడుస్తూ ట్రెండీగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. నెటిజనులు తమదైన శైలి కామెంట్లతో ఆ వీడియోను మరింత వైరల్ చేస్తున్నారు. ప్రగతి ఎన్నడూ లేనిది ఇంతగా శ్రమిస్తున్నారేమిటి? బిగ్ బాస్ సీజన్ -5 కోసమే ఇంతగా శ్రమిస్తున్నారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.