Begin typing your search above and press return to search.
అవార్డుల్లో అవమానించారా.. ఎవరది రాజా?
By: Tupaki Desk | 26 Feb 2019 5:11 AM GMTనటుడు, `మా` అధ్యక్షుడు శివాజీ రాజా పదవికి గడువు ముగుస్తున్న సంగతి తెలిసిందే. రెండోసారి ఆయన `మా` అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. అత్యంత క్లోజ్ సోర్సెస్ చెప్పిన సమాచారం ప్రకారం.. మరోసారి మెజారిటీ శివాజీకే ఉందన్న మాటా వినిపిస్తోంది. రూ.5000 ఫించను అందుకుంటున్న వృద్ధ కళాకారులు, కళ్యాణ లక్ష్మి, విద్యా లక్ష్మి వంటి పథకాల అంకురార్పణతో లబ్ధి పొందిన ఆర్టిస్టులు శివాజీ రాజాకు అనుకూలంగా ఉన్నారు. ఎన్నికల బరిలో ప్రత్యర్థులు బరిలో దిగినా.. ఆర్టిస్టులను అవసరాల్లో ఆదుకున్నందుకు ఆ సేవలు అతడికి వరంగా మారనున్నాయని ఆర్టిస్టుల్లో ముచ్చట్లు సాగుతున్నాయి. తెలుగు సినిమా హిస్టరీలోనే కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ ఇతర ఆర్టిస్టుల సంఘంలోనూ ఇలాంటి పథకాల్ని ప్రవేశపెట్టలేదని ఆర్టిస్టులే చెబుతుండడంతో ఆ ఇమేజ్ శివాజీ రాజాకి కలిసిరానుంది. ఇక ఎలానూ మెగాస్టార్ చిరంజీవి అండదండలు, ఆశీస్సులు బ్యాక్ గ్రౌండ్ లో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి అతడి గెలుపు నల్లేరుపై నడకేనన్న మాటా వినిపిస్తోంది.
ఇప్పటికే మార్చి 10న ఎన్నికలు అని ప్రకటించినా ఇంతవరకూ ఎవరూ ప్రత్యర్థి ప్యానెల్ పోటీ గురించి మాట్లాడకపోవడం చూస్తుంటే శివాజీ రాజా ఏకగ్రీవం అవుతున్నారా? అంటూ మూవీ ఆర్టిస్టుల్లోనూ వాడి వేడిగా చర్చ సాగుతోంది. ఇక ఆర్టిస్టుల ఆత్మ గౌరవం గురించి ప్రస్థావించిన శివాజీ రాజా ఇటీవలే ఓ పెద్ద సంస్థ అవార్డులిస్తున్నాం అంటూ అవార్డుల్ని మొహం పై విసిరి కొట్టినట్టు ఇవ్వడంపైనా ప్రస్థావించారు. 11 ఫిబ్రవరి తర్వాత వీళ్ల గురించి మాట్లాడతాను.. అంటూ కాస్తంత సీరియస్ గానే కనిపించడంపై ఆసక్తి కర చర్చ సాగింది.
ఆర్టిస్టులకు అవార్డులిస్తాం అంటూ ఇటీవల ఆర్టిస్టుల్ని అవమానించారు. అవార్డులు ఎంతో అవమానిస్తూ ఇచ్చేవా? అది బాధ కలిగించింది. మొన్న ఇచ్చిన ఆ కార్పొరెట్ అవార్డుల కంటే.. `భరతముని అవార్డులు` ఎంతో గౌరవంగా ఇస్తుంటారు. రైలు దిగినప్పటి నుంచి కళాకారుడిని తీసుకెళ్లి గౌరవ మర్యాదలు ఇస్తారు వాళ్లు. గౌరవంగా తీసుకునేది అవార్డు... అని ఆవేదనను వ్యక్తం చేశారు. వివాదం కోసం కాదు.. బాధతో అంటున్నా. అవతలి వ్యక్తి అంటే నాకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. దీనిని బట్టి కొన్ని అవార్డుల కార్యక్రమాలు మొక్కుబడి ప్రహసనంతో సాగేవేనా? అన్న సందేహాలు నెలకొన్నాయి ఇప్పుడు.