Begin typing your search above and press return to search.
విలన్లంతా రాస్ బీహారీలే కానక్కర్లేదు
By: Tupaki Desk | 14 July 2015 8:26 AM GMTక్రూరంగా, కర్కశంగా, భయంకరంగా కనిపిస్తేనే విలన్లు అని ఫిక్సయిపోలేం. యంగ్‌గా, నాజూగ్గా కనిపించేవాళ్లలోనూ విలనీ బోలెడంత ఉంటుంది. చూపులకు చురకత్తిలా కనిపించినా కర్కశంగా కోత కోసేసే భయంకరులు మన మధ్యలోనే తిరుగుతుంటారు. అలాంటి ప్రమాదకరమైన మెంటాలిటీ ఉన్న వ్యక్తులంతా విలన్లతోనే సమానం. ఇదిగో ఇక్కడ ఓ విలన్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. అదీ రామ్‌చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాతో విలన్‌గా ఎంటర్ అవుతున్నాడు.
ప్రస్తుతం చెర్రీతో పాటు ఆన్‌సెట్స్ ఉన్నాడు. అతగాడి పేరు అరుణ్ విజయ్. చూడగానే చాక్లెట్‌బోయ్‌ని తలపిస్తున్నాడు. స్టయిలిష్‌గా ఉన్నాడు. నవ్వులు చిందిస్తూ వలలు వేసేట్టే కనిపిస్తున్నాడు. హెయిర్ స్టయిల్ వెరైటీగా ఉంది. ఇన్ని డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్న ఈ కుర్రాడు హీరోగా చేస్తే బావుండేది కదా! అనిపిస్తోంది. కానీ ఆ నవ్వు వెనక భయంకరమైన కర్కశత్వం దాగి ఉందని అతడే చెబుతున్నాడు. గౌతమ్‌మీనన్ శిక్షణలో రాటుదేలిన ఇతగాడు చెర్రీ సినిమాతో టాలీవుడ్‌లో ఎంటర్ కావడం తన అదృష్టమని చెబుతున్నాడు. అన్నట్టు అతడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో 'వా' అనే చిత్రంలో నటిస్తున్నాడు. అటు తమిళ్, ఇటు తెలుగు రెండు పరిశ్రమల్లోనూ తన హవా సాగించాలని ఆశపడుతున్నాడు. వెల్‌కమ్ టు న్యూ విలన్..