Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి అమ్మాయి అయితే

By:  Tupaki Desk   |   20 Nov 2017 10:41 AM GMT
అర్జున్ రెడ్డి అమ్మాయి అయితే
X
అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం అందరికి తెలిసిందే. అయితే సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండే కొంతమంది స్పూఫ్స్ చేసి ఆకట్టుకున్నారు. అదే విధంగా ఎవరి స్టైల్ లో వారు ఉన్నది ఉన్నట్లు చూపించారు. ముఖ్యంగా సినిమాకు భారీ అంచనాలను తీసుకొచ్చిన ట్రైలర్ పై చాలా రకాల స్పూఫ్స్ వచ్చాయి.

అయితే మళ్లీ ఇప్పుడు అర్జున్ రెడ్డి ప్రస్తావన ఎందుకు వస్తోందంటే.. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ పాత్రను అమ్మాయి చేస్తే ఎలా ఉండేది. అసలు ఊహించుకుంటేనే చాలా కొత్తగా ఉంది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో అరుణా రెడ్డి అని ఒక గర్ల్ తెగ హల్ చల్ చేస్తోంది. అర్జున్ రెడ్డి లో వివాదస్పదమైన సీన్స్ తో పాటు బోల్డ్ సీన్స్ ను కూడా చేసేసింది. కేవలం మాములుగా అనలేము గాని చాలా పచ్చిగా నటించేసింది. ముఖ్యంగా విజయ దేవరకొండ ఒక అమ్మాయిని సెక్స్ యాంగిల్ లో గట్టిగా లాక్కోవడం ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే.

ఆ సిన్ ని కూడా ఆమె హాట్ గా చేసేసింది. ఆమె అసలు పేరు ప్రత్యుష. వరంగల్ అమ్మాయి. ఇంతకుముందు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ చేసింది. కానీ అర్జున్ రెడ్డి ట్రైలర్ స్పూఫ్ వీడియో మాత్రం చాలా బోల్డ్ గా తీయడంతో వ్యూవ్స్ చాలా పెరిగిపోతున్నాయి. చాలా మంది బోల్డ్ గా చేశావ్ అని అంటుంటే మరికొంత మంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేసేస్తున్నారు. ముఖ్యంగా కాంట్రవర్షియల్ అయిన డైలాగ్ తో పాటు లాస్ట్ షాట్ లో చూపించిన సీన్స్ మాత్రం చాలా ఘాటుగా ఉన్నాయి.