Begin typing your search above and press return to search.
బుల్లి జేజమ్మకు అనుష్క ఇన్ స్పిరేషన్ కాదుట!
By: Tupaki Desk | 10 Sep 2015 9:37 AM GMTఅరుంధతి సినిమా రిలీజై ఇప్పటికే దశాబ్ధం పైగా అయ్యింది. ఆ సినిమా ఎప్పటికీ టాలీవుడ్ లో డిష్కసన్ పాయింట్. అందులో జేజమ్మగా స్వీటీ అనుష్క అసమాన నటన కనబరిచింది. స్వీటీతో పోటీపడుతూ .. అదే చిత్రంలో దివ్య అనే చిన్నారి అద్భుతంగా నటించి అందరిచేతా జేజేలు అందుకుంది. దివ్య బుల్లి .జేజమ్మగా అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. ఆ తర్వాత దివ్య తెలుగు, తమిళ్ లో కథానాయికగా ఎటెంప్ట్ చేసింది. తెలుగులో నేను నాన్న అబద్ధం అనే చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. కానీ ఎందుకనో కెరీర్ లో నిలదొక్కుకోలేకపోయింది. ప్రస్తుతం ఓ కోలీవుడ్ సినిమాలో నటిస్తూ టచ్ లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే...
చిన్నప్పట్నుంచే సీరియల్స్, మోడలింగ్, ప్రకటనల్లో నటించడం ఇవన్నీ అనుభవమే కాబట్టి తొలి సారి వెండితెర కోసం కెమెరా ముందుకు వచ్చినప్పుడు తడబడలేదు. గత అనుభవం ఉపయోగపడింది. కథానాయికగా ఇటీవలి కాలంలో గ్యాప్ రావడానికి కారణం ఎడ్యుకేషన్ లో బిజీ. ప్రస్తుతం గాయకుడు మనో కొడుకు షకీర్ కి జతగా నటిస్తున్నా. ఓ వైపు ఎంజీఆర్ యూనివర్శిటీ బీబీఎ సెంకండియర్ చదువుతూనే సినిమాల్లో నటన కొనసాగిస్తున్నా అని చెప్పింది.
కథానాయికల్లో ఇన్ స్పిరేషన్ ఎవరు? అని ప్రశ్నిస్తే దివ్య ఏ పేర్లు చెప్పిందో తెలుసా? దీపిక పదుకొన్ - శ్రీదేవి - జ్యోతిక - కాజల్ అంటూ లిస్ట్ చెప్పింది. ఈ లిస్టులో జేజమ్మ అనుష్క పేరు లేనేలేదు. స్టార్ హీరోయిన్ గా నీరాజనాలు అందుకుంటున్నా.. తనతో కలిసి నటించినా స్వీటీ ఈ బుల్లి జేజమ్మకు ఎందుకు నచ్చలేదో?