Begin typing your search above and press return to search.
రాహుల్ ‘అమూల్’ బేబీనే అనేసిన ‘సామాన్యుడు’
By: Tupaki Desk | 14 Dec 2015 9:44 AM GMTకాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆ పార్టీకి చెందిన వారు ‘యువరాజు’ అని కీర్తిస్తే.. రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ‘అమూల్ బేబీ’ అని ఎటకారం చేస్తుంటారు. తాజాగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాదాపు అలాంటి అర్థం వచ్చేలా ట్వీట్ తో విమర్శించారు. పశ్చిమ ఢిల్లీలోని షకూర్ బస్తీలో రైల్వే స్థలాల్లో ఉన్న 1200 ఇళ్లను అధికారులు తొలగించటం.. ఈ క్రమంలో ఆరు నెలల పసిపాప మరణించటంతో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.
రైల్వే శాఖ తీరుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ప్రతిగా ఆ పార్టీకి చెందిన నేతలు పార్లమెంటు వద్ద ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉంటే.. షకూర్ బస్తీని సందర్శించిన రాహుల్.. పార్లమెంటు దగ్గర ఆప్ నేతలు ఆందోళన చేయాటాన్ని రాహుల్ విమర్శించారు. ఢిల్లీలో అధికారంలో ఉంది వాళ్లే కదా అంటూ మీడియా దగ్గర రాహుల్ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. ‘‘రాహుల్ చిన్నపిల్లాడు. ఆయనకు రైల్వేలు కేంద్ర ప్రభుత్వం కిందకు వస్తాయన్న కనీస విషయాన్ని కూడా పార్టీ నేర్పించినట్లు లేదు’’ అంటూ ఘాటుగా ట్వీట్ షాకిచ్చారు. కేంద్ర నియంత్రణలో ఉండే రైల్వే శాఖ తీరుతో మండిపాటుతో ఆమ్ ఆద్మీ ఆందోళనలు చేస్తుంటే.. తమను విమర్శించిన రాహుల్ ను కేజ్రీవాల్ గురి చూసి ట్వీట్ తో వ్యంగ్యంగా కొట్టారు.