Begin typing your search above and press return to search.
మళ్లీ స్వామి వెనకే పడుతున్నారుగా
By: Tupaki Desk | 7 Feb 2017 4:23 AM GMTఏదైనా సినిమాని డబ్బింగ్ కాకుండా.. రీమేక్ ఎందుకు చేస్తారు? లోకల్ నటులను నటింపచేసి.. ఫ్రెష్ సబ్జెక్ట్ అనే ఫీల్ తీసుకువచ్చి.. క్రేజ్ తీసుకురావడానికే అనేది అందరికీ తెలిసిన సింపుల్ ఆన్సర్. కానీ ఒక భాషలో ఓ ఆర్టిస్ట్ చేసిన పాత్రను.. మరో భాషలో చేసేటప్పుటు కూడా అదే నటుడిని తీసుకోవాలని తహతహలాడ్డం అంటే.. ఆ రోల్ ని ఆ యాక్టర్ ఏ రేంజ్ లో మెప్పించాడు అని చెప్పేందుకు మచ్చుతునక.
తని ఒరువన్ చిత్రాన్ని తెలుగులో ధృవ గా రామ్ చరణ్ తో రీమేక్ చేశారు. ఈ మూవీలో విలన్ గా నాగార్జున పేరు కూడా ఓ టైంలో వినిపించింది. అయితే.. చివరకు చెర్రీ అండ్ టీం అరవింద్ స్వామి పాత్రను.. తనతోనే చేయించారు.. మంచి సక్సెస్ సాధించారు. ఇప్పుడు తని ఒరువన్ కాంబినేషన్ అయిన జయం రవి-అరవింద్ స్వామిలు.. బోగన్ అనే మూవీని రిలీజ్ చేశారు. తని ఒరువన్ రేంజ్ లో టాక్ రాకపోయినా.. మూవీకి మాత్రం వసూళ్లు బాగా వస్తున్నాయి. బోగన్ చిత్రాన్ని నిర్మించిన ప్రభుదేవా.. ఇప్పుడు తెలుగు-హిందీలలో కూడా రీమేక్ చేయాలని చూస్తున్నాడు.
అసలు విషయం ఏంటంటే.. ఇక్కడి వెర్షన్లలో హీరోలు మారతారట కానీ.. విలన్ గా మాత్రం మళ్లీ అరవింద్ స్వామినే తీసుకోవాలని చూస్తున్నారట. ధృవ విషయంలోనే రీమేక్ చేసేందుకు ఊగిసలాడిన అరవింద్ స్వామి.. ఇప్పుడు బోగన్ విషయంలో ఏం చేస్తాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/