Begin typing your search above and press return to search.

ధృవ ఈవెంట్: ముసలోడ్ని చేస్తున్నారు!!

By:  Tupaki Desk   |   4 Dec 2016 11:15 PM IST
ధృవ ఈవెంట్: ముసలోడ్ని చేస్తున్నారు!!
X
''అదిగో అక్కడ నేను.. చరణ్‌.. కె.టి.ఆర్ కూర్చొని మాట్లాడుకుంటుంటే.. వాళ్ళు తమ మాటలతో నన్ను ముసలోడ్ని చేస్తున్నారు. ఎందుకంటే వీరందరూ కూడా నేను యాక్టింగ్ మొదలెట్టే టైముకి ఇంకా చాలా చిన్నవారం అని చెబుతుంటే.. ఖచ్చితంగా అది నా ఏజ్ పెంచేసినట్లే. అయితే నేనేమీ ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే వీళ్ళ మనవళ్లు కూడా వచ్చి నా గురించి అలా చెబుతుంటే వినాలని ఉంది'' అంటూ జనాలను ఉత్తేజపరిచే పాజిటివ్ టాక్ కొనసాగించాడు నటుడు అరవింద్ స్వామి.

ధృవ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మరికొన్ని కామెంట్లు చేశాడు స్వామి. ''చాలామంది రీమేక్ లు తీస్తుంటారు. అందుకు రెండుదార్లు ఉన్నాయి. ఒకటి యాజిటీజ్ ఒరిజినల్ లా చేయాలి. రెండోది కొత్తగా ఏమన్నా తీర్చిదిద్దాలి. రెండోదారిని ఎంచుకున్న సురేందర్ రెడ్డి.. అద్భుతమైన మార్పులు చేశాడు. ఒరిజినల్ కంటెంట్ ఈయన ఎడిషన్లు చాలా బాగున్నాయి. ఆయన జడ్జిమెంట్ ను నేను గౌరవిస్తున్నా. ఇక రిజల్ట్ అంతా ఆడియన్స్ చేతిలో ఉంది'' అంటూ సెలవిచ్చాడు.

అలాగే షూటింగు టైములో చరణ్ పెట్టిన ఒక ''చిరు దోశ'' గురించి తెగ చెప్పాడు. ఆ స్టీముడ్ దోశ చాలా బాగుందట. అలాగే షూట్ టైములో అందరూ తనకు మంచి మిత్రులు అయిపోయారని చెప్పాడు.