Begin typing your search above and press return to search.

#ఆర్య 30 లుక్.. టైస‌న్ కాదు కానీ హోలీఫీల్డ్ లా మారాడు!

By:  Tupaki Desk   |   2 Dec 2020 6:53 AM GMT
#ఆర్య 30 లుక్.. టైస‌న్ కాదు కానీ హోలీఫీల్డ్ లా మారాడు!
X
స్పోర్ట్స్ నేప‌థ్యంలో సినిమా అన‌గానే న‌రాలు ఉప్పొంగే ఉత్కంఠ యూత్ లో ఉంటుంది. పైగా బాక్సింగ్ నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ చిత్రం తెర‌కెక్కిస్తుంటే యాక్ష‌న్ ప్రియుల‌కు చెవులూరేస్తాయి. ఇప్పుడు అలాంటి కిక్ బాక్సింగ్ ఫీట్స్ కి రెడీ అవుతూ త‌మిళ స్టార్ హీరో ఆర్య అంద‌రి అటెన్ష‌న్ ని త‌న‌వైపు తిప్పేసుకుంటున్నాడు.

లేటెస్టుగా ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ రివీలైంది. పోస్ట‌ర్ లో ఆర్య భీక‌రాకారుడిగా మారి అదిరిపోయే మేకోవ‌ర్ తో క‌ట్టి ప‌డేశాడు. భారీగా కండ‌లు పెంచి శ‌రీరాకృతిని పూర్తిగా మార్చేశాడు. అత‌డి లుక్ మ‌రీ బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ లా క‌నిపించ‌క‌పోయినా.. అత‌డి స‌మ‌కాలికుడైన చాంపియ‌న్ హోలీ ఫీల్డ్ లా క‌నిపించేస్తుండ‌డంతో గాళ్స్ లో అది హాట్ టాపిక్ అయ్యింది.

అన్న‌ట్టు ఈ సినిమా టైటిల్ ఏమిటి? అంటే.. `సల్పత్తా` అని పేరు పెట్టనున్నారని.. ఇది చెన్నైకి చెందిన ప్ర‌ముఖ క్రీడాకారునిపై సినిమా అన్న ప్ర‌చారం వేడెక్కిస్తోంది. ఆర్య న‌టిస్తున్న 30వ సినిమా కావ‌డంతో అత‌డి అభిమానులు ఈ లుక్ చూసి సంబ‌రాలు చేసుకుంటున్నారు. వ‌రుస‌గా ర‌జ‌నీతో కాలా- క‌బాలీ లాంటి క్రేజీ చిత్రాల్ని తెర‌కెక్కించిన పా.రంజిత్ ఈసారి ఆర్య‌ను ఏ రేంజులో చూపించ‌నున్నాడో చూడాల‌న్న ఉత్కంఠ ఉంది.

ఇక ఈ చిత్రంలో దుషారా విజయన్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. పార్థిబాన్ రాధాకృష్ణన్ .. సంతోష్ ప్రతాప్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కె 9 స్టూడియోస్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. ఇక ఇదే కాక ఆర్య తన తదుపరి చిత్రం అరన్మానై 3 లో న‌టించ‌నున్నారు. సుందర్ సి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్య‌ ఇటీవల పొల్లాచిలో ఈ చిత్రం సెట్లలో చేరాడు. ఇందులో ఆర్య దెయ్యం పాత్ర‌లో న‌టిస్తార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నా