Begin typing your search above and press return to search.
ముదురు బాబు - లేత పాప మునిగి తేలుతున్నారట
By: Tupaki Desk | 8 Jan 2019 6:00 AM GMTతెలుగు ప్రేక్షకులకు అక్కినేని అఖిల్ తో పాటు ‘అఖిల్’ చిత్రంతో పరిచయం అయిన ముద్దుగుమ్మ సాయేషా సైగల్ మొదటి సినిమా బొక్క బోర్లా పడటంతో మళ్లీ జాడా పత్తా లేకుండా పోయింది. తెలుగులో రెండవ అవకాశం కోసం ఎదురు చూడకుండా తమిళనాట ఈ అమ్మడు చాలా బిజీ అయ్యింది. ఒక వైపు హిందీ సినిమాలు చేస్తూనే తమిళనాట వరుసగా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ వస్తోంది. ఈ సమయంలోనే ఈ అమ్మడు తమిళ హీరో ఆర్యతో ప్రేమలో ఉందంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆర్యతో ఈమె గత సంవత్సరం ‘గజినీకాంత్’ అనే చిత్రంలో నటించింది. ఆ సమయంలోనే ఇద్దరి మద్య ప్రేమ పుట్టినట్లుగా చెబుతున్నారు.
‘గజినీకాంత్’ సినిమాలో ఆర్య - సాయేషా సైగల్ ల కాంబినేషన్ లో మోతాదుకు మించి రొమాంటిక్ సీన్స్ ను చిత్రీకరించారు. ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా - నాచురల్ గా రొమాంటిక్ సీన్స్ లో నటించారు. దాంతో ఇద్దరి మద్య వ్యవహారం ఉందంటూ పుకార్లు షికార్లు చేయడం మొదలు పెట్టాయి. సినిమా తర్వాత కూడా ఇద్దరు ఒకరితో ఒకరు మీటింగ్ - చాటింగ్ లు అంటూ తిరుగుతున్నారు. చెన్నై వచ్చిన ప్రతి సారి కూడా ఆర్యను సాయేషా కలుస్తుందంటూ తమిళ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా సాయేషా సైగల్ తల్లి కూడా ఆర్యను ఒక చిత్రం షూటింగ్ లో ఉండగా సెట్ కు వెళ్లి మరీ కలిసిందట.
ఈ పరిస్థితులన్నీ గమనిస్తూ ఉంటే ఆర్య మరియు సాయేషాలు త్వరలోనే ఒక్కటయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇరువైపుల కుటుంబ సభ్యులు పెళ్లికి ఓకే చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఇద్దరి మద్య వయసు తేడా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆర్య ముదురు బెండకాయ మాదిరిగా 38 ఏళ్లు నిండి ఉన్నాడు, సాయేషా మాత్రం లేత బెండ మాదిరిగా 21 ఏళ్లలోనే ఉంది. అంటే వీరిద్దరి మద్య ఏకంగా 17 ఏళ్ల గ్యాప్ ఉందన్నమాట. ఇండస్ట్రీలో ఈ గ్యాప్స్ అనేవి చాలా కామన్. అంతకు మించి గ్యాప్ ఉన్న వారు కూడా పెళ్లి చేసుకున్నారు. కాని మరీ 21 ఏళ్లకే సాయేషాకు పెళ్లి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా పుకార్లు అయ్యే అవకాశం కూడా ఉంది. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో, ఎలాంటి ప్రకటనలు వినాల్సి ఉంటుందో..!