Begin typing your search above and press return to search.

ప్రైమ్ లో ఆర్య బాక్సింగ్ డ్రామా 'సర్పట్టా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

By:  Tupaki Desk   |   8 July 2021 11:14 AM GMT
ప్రైమ్ లో ఆర్య బాక్సింగ్ డ్రామా సర్పట్టా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!
X
కరోనా పరిస్థితుల నేపథ్యంలో థియేటర్లు మూతబడి ఉండటంతో సినిమాల రిలీజులు వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ సినిమాల విడుదలకు ప్రత్యామ్నాయంగా మారాయి. ఓటీటీలు ఫ్యాన్సీ ఆఫర్స్ ఇవ్వడానికి ముందుకు వస్తుండటంతో.. పలువురు మేకర్స్ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడానికి డీల్స్ కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే అన్ని భాషల్లో చాలా సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యాయి. పెద్ద సినిమాల నిర్మాతలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూస్తుంటే.. ఆర్థిక భారం పడుతుందని భావించిన చిన్న మీడియం చిత్రాల నిర్మాతలు మాత్రం ఓటీటీ రిలీజ్ కు మొగ్గు చూపుతున్నారు. థియేటర్లు తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నప్పటికీ.. ఆల్రెడీ డీల్స్ కుదుర్చుకున్న సినిమాలు ఓటీటీ వేదికల్లోనే స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో ఆర్య నటించిన "సర్పట్ట" చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

'అట్టకత్తి' 'మద్రాస్‌' 'మద్రాస్' 'కబాలి' 'కాలా' వంటి వైవిధ్యమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు పా.రంజిత్ "సర్పట్టా" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'పరంబరై' అనేది దీనికి ఉపశీర్షిక. స్లమ్ ఏరియా నుంచి వచ్చిన ఓ యువకుడు.. బాక్సర్ గా ఎలా సక్సెస్ అయ్యాడు అనే వాస్తవ సంఘటన ఆధారంగా రెడీ చేసిన కథాంశంతో ఈ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఫ్యాన్సీ ధరకు "సర్పట్ట" సినిమా హక్కులు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని జూలై 22వ తేదీన ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా బాక్సింగ్ రింగ్ లో ఉన్న ఆర్య కు సంబంధించిన ఓ ఇంటెన్స్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

కాగా, "సర్పట్ట" సినిమాలో ప్రొఫెషనల్ బాక్సర్‌ గా కనిపించేందుకు హీరో ఆర్య తీవ్రంగా కసరత్తులు చేసి సిక్స్‌ ప్యాక్‌ బాడీని రెడీ చేసాడు. ఇది ఆర్య కెరీర్ లో వస్తున్న 30వ చిత్రం. ఇందులో దుషారా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. పార్థిబాన్ రాధాకృష్ణన్ - సంతోష్ ప్రతాప్ - కళైఅరసన్‌ - పసుపతి - భగవతి - జాన్‌ విజయ్‌ - సంజనా నటరాజన్‌ - తుషార తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కె9 స్టూడియోస్ బ్యానర్ పై షణ్ముగం దక్షణ రాజ్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోకు లాభాలకు ఇచ్చేసారని తెలుస్తోంది.