Begin typing your search above and press return to search.
నిను వీడని నీడలా పెళ్లాం వెంటే హీరో గారు..!
By: Tupaki Desk | 11 March 2022 12:30 AM GMTనిను వీడని నీడను నేను! అంటూ వెంటాడుతుంది ఒక బొమ్మాళీ. కొందరు భర్తలకు వైఫ్ తో అటాచ్ మెంట్ ఆ లెవల్లో ఉంటుంది. ఈ యంగ్ హీరో వ్యవహారం చూసిన వాళ్లకు ఆ సంగతి ఇట్టే అర్థమైపోతుంది.
ఇంతకుముందు ``పెళ్లాడుతాను.. పిల్ల కావలెను!`` అంటూ సామాజిక మాధ్యమాల్లో బోల్డ్ గా ప్రకటించిన తమిళ యువహీరో ఆర్య.. పెళ్లి తర్వాత తన భార్య సయేషాను ఎంతో మురిపెంగా చూసుకుంటున్న సంగతి తెలిసిందే. మూడేళ్ల కాపురంలో ఎన్నో సరిగమల్ని ఆస్వాధించిన బుల్లోడు.. నిను వీడని నీడలా భార్యామణినే అంటి పెట్టుకుని కనిపిస్తున్నాడు ప్రతిసారీ.
ఇది ఫిర్యాదు కాదు కానీ.. ఆర్యలా హానెస్ట్ హబ్బీ ఈ రోజుల్లో చాలా కష్టం. ఇప్పుడున్నవి అన్నీ గెహ్రయాన్ ప్రేమకథలేనని ప్రూవ్ అవుతోంది! తాజాగా మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య సాయేషాకు ఆర్య శుభాకాంక్షలు చెబుతూ.. అందమైన పోస్ట్ తో ఆకట్టుకున్నాడు.
ఈ పోస్టింగ్ ఇంటర్నెట్ లో వేగంగా హృదయాలను గెలుచుకుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆర్య తన ప్రేమను వ్యక్తం చేసిన తీరు ఆకట్టుకుంది. ``ఈ ప్రపంచంలో నేను కోరుకునే ఉత్తమ భాగస్వామికి మూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నన్ను ఎక్కువగా చూసుకున్నందుకు.. ప్రేరేపించినందుకు.. మద్దతునిచ్చినందుకు .. ప్రేమిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. లవ్ యు!`` అని వ్యాఖ్యను జోడించాడు.
భార్యామణి కం నటి సయేషా కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. ``నేను ఎప్పటికీ ప్రేమించే ఆదరించే గౌరవించే గొప్ప వ్యక్తికి వార్షికోత్సవ శుభాకాంక్షలు! గ్రహం మీద ఉత్తమ భర్త .. నాన్న అయినందుకు ధన్యవాదాలు! శాశ్వతత్వంగా మీతోనే ..!`` అని వ్యాఖ్యను జోడించింది
అందమైన జంట తమ మూడవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొలీగ్స్ నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాశి ఖన్నా- ఖుష్బూ సుందర్ -సత్యరాజ్ తదితరులు ఉన్నారు. 2019లో సయేషాని ఆర్య పెళ్లాడాడు.
పెళ్లికి ముందు ఈ జంట కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. సయేషా సైగల్ బాలీవుడ్ అమ్మాయి. సౌత్ కుర్రాడు ప్రేమ పెళ్లిలో సఫలమయ్యాడు. పెద్దల్ని ఒప్పించి మనువాడాడు. ఇప్పుడు ఒక ఆడబిడ్డకు తల్లిదండ్రులు ఈ జంట. రెండో బిడ్డకు వెల్ కం చెప్పే సమయమాసన్నమైందన్న సిగ్నల్స్ ఇచ్చాడు ఆర్య.