Begin typing your search above and press return to search.
హీరోయిన్లతో క్లోజే.. అయితే ఏంటి?
By: Tupaki Desk | 13 July 2015 1:35 AM GMTనాకా హీరోయిన్లతో అఫైరా.. నేనసలు అమ్మాయిల జోలికే వెళ్లను అనేస్తుంటారు చాలామంది హీరోలు. కానీ తమిళ కథానాయకుడు ఆర్య మాత్రం చాలా డిఫరెంట్‌గా మాట్లాడుతున్నాడు. నా హీరోయిన్లందరితో నేను చాలా క్లోజ్‌గా మూవ్ అవుతుంటాను.. ఐతే ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు. తమిళనాట అఫైర్ల వీరుడిగా ఆర్యకు పెద్ద పేరే ఉంది. తన సినిమాల్లో నటించిన ప్రతి హీరోయిన్‌తోనూ అఫైర్ నడుపుతుంటాడని అతడికి పేరు. ముఖ్యంగా నయనతారతో అతడి బంధం గురించి చాలా కాలంగా రూమర్లు వినిపిస్తున్నాయి.
దీని గురించే ఆర్య దగ్గర ప్రస్తావిస్తే.. మీడియా వాళ్లు మాత్రమే కాదని.. తన స్నేహితులకు కూడా తన మీద చాలా అనుమానాలున్నాయని.. ఫలానా హీరోయిన్‌తో అఫైర్ మాటేంటి అని అడుతున్నారని ఆర్య చెప్పాడు. ''నేను హీరోయిన్లతో క్లోజ్‌గా మూవ్ అవుతానన్న మాట వాస్తవమే. నేను అమీ జాక్సన్, నయనతార, త్రిష, అనుష్క, హన్సిక.. ఇలా నాతో నటించిన ప్రతి హీరోయిన్‌తోనూ క్లోజ్‌గా ఉంటాను. వాళ్లందరూ నాకు మంచి స్నేహితులు. నా వ్యక్తిగత విషయాల్ని వాళ్లతో పంచుకుంటాను. వాళ్లు కూడా అదే చేస్తారు. హీరోయిన్లతో ఫ్రెండ్లీగా ఉంటే షూటింగ్ సాఫీగా సాగిపోతుంది. ఐతే నేను ప్లేబాయ్‌ను మాత్రం కాదు. నామీద వచ్చే రూమర్లను నేను భలే ఎంజాయ్ చేస్తా. ఎందుకంటే ఆ రూమర్లే లేకుంటే జనాలు మనల్ని మరిచిపోతారు'' అని ఆర్య అన్నాడు.