Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: విశాల్ కి విల‌న్ గా ఫ్రెండు ఆర్య‌?

By:  Tupaki Desk   |   15 Oct 2020 5:30 AM GMT
ట్రెండీ టాక్‌: విశాల్ కి విల‌న్ గా ఫ్రెండు ఆర్య‌?
X
త‌మిళ ఇండ‌స్ట్రీలో విశాల్ - ఆర్య స్నేహం గురించి తెలిసిందే. ఆ ఇద్ద‌రూ క‌లిసి బాలా తెర‌కెక్కించిన వాడు - వీడు చిత్రంలో న‌టించారు. వాడు వీడు సినిమా కామెడి రొమాంటిక్ డ్రామా అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రాన్ని విక్రమ్ కృష్ణ నిర్మించారు. సినిమాలో ప‌క్కా ప‌ల్లెటూరు మొర‌టోళ్లుగా విశాల్ .. ఆర్య న‌ట‌న‌కు క్రిటిక్స్ ప్ర‌శంస‌లు కురిసాయి.

అందుకే ఆ ఇద్ద‌రూ క‌లిసి మ‌రోసారి ప్ర‌యోగం చేస్తున్నారు అన‌గానే ఒక‌టే ఉత్కంఠ నెల‌కొంది. అయితే ఈసారి విశాల్ కి విల‌న్ గా ఆర్య న‌టిస్తార‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. నోటా ఫేం ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా నోటా దర్శకుడు ఆనంద్ శంకర్ తన సోషల్ మీడియాలో తన తదుపరి చిత్రంలో ఆర్య - విశాల్ స్క్రీన్ స్థలాన్ని పంచుకుంటారని వెల్లడించారు. నటీనటుల పాత్రలు ఇంకా అధికారికంగా వెల్లడించకపోగా,.. ఈ చిత్రంలో ఆర్య ప్రధాన విరోధిగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఆర్యను విల‌నా కాదా అన్న‌ది మేక‌ర్స్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. ఇక విశాల్ .. ఆర్య ప‌రిశ్ర‌మ‌లో మంచి స్నేహితులు. ఆ ఇద్ద‌రూ ఇప్ప‌టికే 30 సినిమాల్లో న‌టించారు. # VISHAL30 మరియు # ARYA32 # ఆనంద్ శంక‌ర్ 4 వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

విశాల్ త‌దుప‌రి తుప్పరివలన్ 2 సహా రెండు చిత్రాలు చేస్తున్నారు. చక్ర చిత్రం ఒటిటి ప్లాట్ ఫామ్ పై ప్రత్యక్షంగా విడుదల కానుందని తెలిసింది. మరోవైపు ఆర్య సుందర్ సి ఆర‌ణ్మ‌నై.... పా రంజిత్ సల్పట్టా .. టెడ్డీ అనే మూడు చిత్రాలు చేస్తున్నాడు. టెడ్డీ ఒటిటి ప్లాట్ ఫామ్ పై విడుద‌ల కానుంది.