Begin typing your search above and press return to search.
ఆర్యన్ ఖాన్ - అనన్య పాండే వాట్సాప్ చాట్ లీక్..!
By: Tupaki Desk | 26 Oct 2021 9:56 AM GMTబాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ పై నమోదైన డ్రగ్స్ కేసులో 'లైగర్' హీరోయిన్ అనన్య పాండే విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ తో అనన్య పాండే జరిపిన వాట్సాప్ చాట్ ఆధారంగా సమన్లు జారీ చేసి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఆమెను రెండుసార్లు ప్రశ్నించారు. వాట్సాప్ ద్వారా ఇరువురి మధ్య డ్రగ్స్ గురించి చర్చ జరిగినట్లు ఇప్పటికే ఎన్సీబీ ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. ఈరోజు ముంబై డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని గంటల ముందు అనన్య - ఆర్యన్ మధ్య జరిగిన మరో చాటింగ్ వివరాలు బయటకు వచ్చాయి.
ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ విషయంలో అనన్యా పాండే సహాయం చేసినట్లు ఈ ఛాట్ ప్రకారం తెలుస్తోంది. ఈ చాట్ లలో ఒకదానిలో, "ఇప్పుడు నేను బిజినెస్ లో ఉన్నాను" అని ఆర్యన్ కి అనన్య మెసేజ్ పంపింది. దానికి "నువ్వు వీడ్ తెచ్చావా?" అని ఆర్యన్ ఖాన్ అడిగాడు. "నేను దానిని తీసుకుంటున్నాను" అని అనన్య సమాధానం ఇచ్చింది. ఇలా స్టార్ కిడ్స్ మధ్య మొదటి ఛాటింగ్ 2019 జూలై 6న జరిగింది. తాజాగా బయటకు వచ్చిన చాట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
జాతీయ మీడియాలో ఆర్యన్ ఖాన్ మరియు అనన్య పాండే డ్రగ్స్ కొనుగోలు గురించి చర్చించిన ఈ చాట్ లలో కొన్నింటిని యాక్సెస్ చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప్రస్తుతం ఆర్యన్ - అనన్య ఇద్దరికీ సన్నిహితంగా ఉండే ఇతర స్టార్ పిల్లల డేటాలను పరిశీలిస్తోందని తెలుస్తోంది. 2 ఏళ్ల కిందట జరిగిన ఛాటింగ్ లపై దృష్టి సారించిన అధికారులు.. ఇప్పటికే అనన్య ను వీటి గురించి ప్రశ్నించారు. ఈ క్రమంలో అనన్యా పాండేకు చెందిన మొబైల్ ఫోన్స్ ని ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది. అయితే తాను ఎప్పుడూ డ్రగ్స్ వినియోగించలేదని, ఆర్యన్ ఖాన్ కు డ్రగ్స్ విషయంలో సాయం చేయలేదని అనన్యా అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.
కాగా, ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు జరిపిన దాడులలో పట్టుబడిన వారిలో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ ను కోర్టు పలుమార్లు కొట్టివేసింది. ఈ క్రమంలో నాలుగో సారి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. ఈసారైనా ఆర్యన్ కు బెయిల్ లభిస్తుందో లేదో చూడాలి.