Begin typing your search above and press return to search.
రైటర్ గా ఎంట్రీ..షారుక్ తనయుడిలో అంతుందా?
By: Tupaki Desk | 12 Aug 2022 7:41 AM GMTఎక్కడైనా తెలివైనా వాళ్లు..తెలివి తక్కువ వాళ్లు అంటూ రెండు సెక్షన్లు తప్పనిసరి. ఇదే విషయాన్ని టాలీవుడ్ కి ఆపాదిస్తే? ఇప్పుడున్న వారసులకు కొంత మందికి కనీస డిగ్రీ లు కూడా లేవు. తండ్రులు..తాతలు...ఇలా బ్యాకప్ ఉండటంతో ఇండస్ర్టీకి వచ్చేసారు. ఏదో తూతూ మంత్రంగా చదువులు పూర్తిచేసి ఇండస్ర్టీకి వచ్చి స్థిరపడిపోయారు.
కాకపోతే ఇక్కడ చదువును అశ్రద్ద చేసినట్లు గా కెరీర్ విషయంలో అలాంటి అశ్రద్ద చేయలేదు. కొంత అనుభవం పాఠాలు నేర్పుతుంది కాబట్టి...ఈసారి తప్పిదాలకు తావు ఇవ్వలేదు. జీవితంలో ఎదగడం కోసం నిరంతరం ఎంతో శ్రమించారు. సినిమా షూటింగ్ అంటే చిన్న విషయం కాదు. ఒక పాత్ర కోసం సిద్దమవ్వడం అంటే అంత వీజీ కాదు.
ఎంతో శ్రమించాలి. ఎంతో ఓర్పుతో..నేర్పుతో ముందుకెళ్లాలి. కమిట్ మెంట్..డెడికేషన్ అనే పదాలకు కట్టుబడి ఉండాలి. అవన్నీ చేయగల్గితేనే? స్టార్ గా అవతరించేది. ఫెయిలయ్యారంటే వీటిలో లోపాలున్నాయని అర్ధం. మన హీరోలు కొంత మంది చదువు విషయంలో ఫెయిలైనా స్టార్ గా ఎదగడంలో మాత్రం ఫెయిలవ్వలేదు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు కూడా ఇండస్ర్టీకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఓస్టార్ కుమారుడు సాధారణంగా స్టార్ గానే ఎంట్రీ ఇస్తాడు. కానీ ఆర్యన్ ఖాన్ మాత్రం మ్యాకప్ వేసుకోవడం లేదు. పరిశ్రమకి రచయితగా పరిచయం అవుతున్నాడు. ఓ రియల్ లైఫ్ కామెడీ కథని సిద్దం చేస్తున్నాడు. ఇందులో తన అనుభవాల్ని సైతం రంగరిస్తున్నాడు.
ఈ కథని ఓ వెబ్ సిరీస్ గా మలిచే ప్లాన్ లో ఉన్నట్లు తెలిసింది. మరో రెండు మూడు నెలల్లో స్ర్కిప్ట్ వర్క్ పూర్తవుతుందిట. వచ్చే ఏడాది ఈ వెబ్ సిరీస్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారుట. అయితే ఈ వెబ్ సిరీస్ కి దర్శకుడు ఎవరు? నిర్మాత? ఎవరు అన్న వివరాలు ఇంకా రివీల్ చేయలేదు. అయిత ఓ స్టార్ హీరో కుమారుడు ఇలా రైటర్ గా పరిచయమవ్వడం? ఆసక్తికరంగా మారింది.
ఆర్యన్ ఖాన్ లో ఇలాంటి ప్రతిభ కూడా ఉందా? రాసేంత ట్యాలెంట్ ఆర్యన్ లో ఉందా? అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం..సో సైటీపై అవేర్ నెస్ వంటివి ఉన్నప్పుడే రాసే అలవాటు ప్రారంభం అవుతుంది. ఆర్యన్ లో అవన్నీ చిన్న వయసు నుంచి మొదలైందా? అన్నది తెలియాలి.
ఇక ఆర్యన్ హీరో మెటీరియల్ కూడా. మ్యాకప్ వేసుకుని కెమెరా ముందుకొచ్చాడంటే? దద్దరిల్లిపోతుంది. తండ్రి పై ఉన్న అభిమానంమంతా ఆర్యన్ పై కనిపిస్తుంది. ఆ రకంగా ఆర్యన్ ఎప్పుడైనా నటుడిగా ఎంట్రీ ఇవ్వొచ్చు. కాకపోతే అంతకు ముందే తనలో హిడెన్ ట్యాలెంట్ ని బయటకు తీస్తున్నాడు. మరోవైపు షారుక్ కుమార్తె సుహానా ఖాన్ కూడా `ది అర్చీస్` సిరీస్ తో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే.