Begin typing your search above and press return to search.

మిత్రుడ్ని కలిసే అవకాశం ఇవ్వమని కోర్టును అడగనున్నాడట

By:  Tupaki Desk   |   7 Jan 2022 5:34 AM GMT
మిత్రుడ్ని కలిసే అవకాశం ఇవ్వమని కోర్టును అడగనున్నాడట
X
దేశ వ్యాప్తంగా సంచలనాన్ని రేపటమే కాదు.. బాలీవుడ్ బాద్షా కుటుంబ ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసిన డ్రగ్స్ ఉదంతం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముంబయి నుంచి గోవాకు వెళుతున్న క్రూజ్ లో డ్రగ్స్ తో పాటు షారూక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దొరికిపోవటం.. జైలుకు వెళ్లటం.. నానా కష్టాలు పడి.. కోర్టును వేడుకొని బెయిల్ మీద బయటకు రావటం తెలిసిందే. ఈ ఉదంతంలో ఆర్యన్ ఖాన్ తో పాటు అతని ప్రాణస్నేహితుడు అర్భాజ్ మర్చంట్ సైతం ఇదే కేసులో జైలుకు వెళ్లటం తెలిసిందే.

వీరిద్దరికి బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం ఒక కండీషన్ మీద వారిని బయటకు వెళ్లనిచ్చింది. బెయిల్ మీద ఉన్న వేళ.. వీరిద్దరూ బయట కలవకూడదన్న కండీషన్ ను పెట్టింది. కోర్టు ఆదేశం వీరి స్నేహానికి పరీక్షగా మారింది. ఒకే కేసులో అరెస్టు అయితే.. జైల్లోనూ కలిసి ఉన్న ఈ స్నేహితులు ఇద్దరు.. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మాత్రం కలిసేందుకు అనుమతి లేకపోవటంతో.. తీవ్ర వేదన చెందుతున్నారట.

దీంతో.. అర్భాజ్ మిత్రుడ్ని కలవాలని తపిస్తున్నాడట. ఆర్యన్ ఖాన్ కూడా మిత్రుడ్ని కలిసేందుక సిద్దంగా ఉన్నా.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏమీ చేయలేకపోతున్నాడట. దీంతో.. తమ స్నేహాన్ని అడ్డుకోవద్దని కోర్టును కోరాలని ఆర్భాజ్ సిద్ధమవుతున్నాడట. తాజాగా అర్భాజ్ తండ్రి అస్లమ్ మర్జెంట్ మాట్లాడుతూ.. తన కొడుకు ప్రతి వారం ఎన్సీబీ అధికారుల్ని కలిసేందుకు సిద్ధంగానే ఉన్నాడని.. అతను ఆర్యతో కూడా కలవాలని భావిస్తున్నాడని పేర్కొన్నారు. ఇందుకోసం కోర్టును రిక్వెస్టు చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి.. ఈ ఆప్త మిత్రులు కలుసుకునేందుకు కోర్టు ఓకే చెబుతుందో లేదో చూడాలి.