Begin typing your search above and press return to search.
ఆర్యన్ జైలు జీవితం...షారుక్ బ్రాండ్ పై ఇంపాక్ట్!
By: Tupaki Desk | 12 Oct 2021 11:30 PM GMTబాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ముద్దుల తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు పాలైన సంగతి తెలిసిందే. కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో ఆర్యన్ కి జైలు జీవితం తప్పలేదు. బెయిల్ పిటిషన్ ని కోర్టు కొట్టేయడంతో సన్నివేశం మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో షారుక్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కష్ట సమయంలో షారుక్ కి బాసటగా హృతిక్ రోషన్..సల్మాన్ ఖాన్ నిలిచారు. దైర్యంగా ఉండమని మనోధైర్యాన్ని ఇచ్చారు. ఇంకొంత మంది బాలీవుడ్ ప్రముఖులు మౌనం వహించడం షారుక్ ని మరింత కృంగదీసినట్లు అయింది.
పరిశ్రమ తరుపు నుంచి ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడించినా...షారుక్ కి బాగా తెలిసిన వారు సైతం ఇప్పుడు మౌనంగా ఉండటంతో ఆయన మరింత క్షోభకు గురవుతున్నట్లు సమాచారం. ఆర్యన్ అరెస్ట్ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? లేక నిజంగా డ్రగ్స్ కేసులో దొరికాడా? అని కూడా అనుమనాం వ్యక్తం అవుతోంది. ఆ రీజన్స్ ఎలా ఉన్నా ఆర్యన్ జీవితం మాత్రం ఒక్కసారిగా తల్లకిందులైంది. దీంతో షారుక్ కి తండ్రిగా తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. కంటి మీద కునుక లేకుండా నిత్రలేని రాత్రులను గడుపుతున్నారు. షారుక్ ని ఇంతలోనే ప్రఖ్యాత `బైజూస్` సంస్థ తమ ప్రచార కర్తను తొలగించడం సంచలంగా మారింది.
తనయుడు చేసిన తప్పుకి తండ్రి కి శిక్షపడినట్లు అయింది. షారుక్ బ్రాండ్ వ్యాల్యూ పై తనయుడి జైలు జీవితం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో షారుక్ సినిమాలన్ని వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుక్ ఓ సినిమా చేస్తున్నాడు. కొద్ది భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఇంతలోనే ఆర్యన్ వివాదం తెరపైకి రావడం అన్నింటికి ముప్పు తెచ్చి పెట్టింది. మునుముందు షారూక్ తో కాంట్రాక్టులు ఉన్న ప్రముఖ బ్రాండ్ల పరిస్థితి ఏమిటోనన్న అనుమానాలున్నాయి.
శత్రువులకు దొరికిపోయిన ఖాన్
షారూక్ వారసుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సేవిస్తూ ఎన్.సి.బికి పట్టుబడడంతో ఇప్పుడు ఈ వ్యవహారం శత్రువులకు అలుసైపోతోంది. ముఖ్యంగా ఖాన్ లు అంటే అంతెత్తున ఎగిరి పడే కంగన కత్తి దూసింది. షారూక్ ఖాన్ జరిగిన దానికి సారీ చెప్పడా? అంటూ ప్రశ్నిస్తోంది. కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించి షారూఖ్ పై కంగన పరోక్షంగా మండిపడ్డారు. మాదకద్రవ్యాల కేసులో తన కుమారుడిని అరెస్ట్ చేసిన తర్వాత చైనీస్ స్టార్ జాకీ చాన్ ఎలా క్షమాపణలు చెప్పారో వివరించిన కంగన.. కొడుకుని రక్షించడానికి జాకీచాన్ నిరాకరించారని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఫోటోలో జాకీ చాన్ అతని కుమారుడి కోల్లెజ్ ను ఆమె షేర్ చేసింది. ``అతని కొడుకును పోలీసులు తీసుకెళ్లారు. 2014 లో మాదకద్రవ్యాల కేసులో కుమారుడిని అరెస్టు చేసినప్పుడు జాకీ చాన్ అధికారికంగా క్షమాపణలు చెప్పాడు! అతను కుమారుడి చర్యకు సిగ్గుపడుతున్నాను.. ఇది నా వైఫల్యం.. అతన్ని రక్షించేందుకు నేను జోక్యం చేసుకోను`` అని చెప్పాడు. ``దీని తరువాత అతని కుమారుడు 6 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. క్షమాపణ కూడా చెప్పాడు`` అంటూ తెలిపింది.
ఆర్యన్ పై డ్రగ్స్ కేసుపై కంగనా రనౌత్ తన వైఖరిని స్పష్టం చేసేందుకు ఏమాత్రం జంకలేదు. ఇంతకుముందు హృతిక్ రోషన్ బరిలో దిగి ఆర్యన్ కు తన సంఘీభావం తెలియజేస్తూ ఒక నోట్ పోస్ట్ చేసిన తర్వాత ఆమె రంగంలోకి దిగి ఇలా పేర్కొంది. ``ఇప్పుడు మాఫియా పప్పు అందరు ఆర్యన్ ఖాన్ రక్షణ కల్పించేందుకు ముందుకొస్తున్నారు ... వాళ్లు తప్పులు చేస్తున్నా కానీ వదిలిపెట్టేయాలి .. ఇది అతనికి దృక్పథాన్ని చూపిస్తోందని నేను నమ్ముతున్నాను.. అతని చర్యల పర్యవసానాలను అతనికి తెలియజేయండి ... ఎవరైనా బలహీనంగా ఉన్నప్పుడు వారి గురించి గాసిప్ చేయకపోవడం మంచిది కానీ వారు ఏ తప్పు చేయలేదని వారికి అనిపించడం నేరం... అంటూ ఘాటుగా హృతిక్ పై కౌంటర్లు వేసింది క్వీన్.
ప్రస్తుతానికి ఆర్యన్ ఖాన్ ఆర్థర్ రోడ్ జైలులో ఉన్నాడు. ముంబై కోర్టు శుక్రవారం అతని అభ్యర్ధనను మెయింటెనబిలిటీ ప్రాతిపదికన తిరస్కరించింది. అక్టోబర్ 3 న క్రూయిజ్ షిప్ లో నిర్వహించిన దాడిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అతడిని అరెస్టు చేసి నిర్బంధించింది. ఇప్పటికీ ఆర్యన్ కి కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.