Begin typing your search above and press return to search.
తెలుగు తెరపైకి కొత్త విలన్ వస్తున్నాడు
By: Tupaki Desk | 4 July 2016 8:02 AM GMTకొత్త విలన్ అంటే.. ఏదో వేరే ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వస్తున్నాడు అనుకోకండి. మన పరిశ్రమలోనే ఇంతకుముందు హీరోగా నటించి.. ఫెయిల్ అయిన ఓ నటుడు విలన్ అవతారం ఎత్తబోతున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్. తన తండ్రీ దర్శకత్వంలో ‘హాయ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఓ పది సినిమాల దాకా చేసిన రాజేష్.. హీరోగా సక్సెస్ కాలేకపోయాడు. వరుస ఫ్లాపులతో సతమతమై కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలకు దూరమైపోయాడు. ఐతే తన అన్నయ్య మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నాడని.. కానీ ఈసారి హీరోగా కాకుండా విలన్ పాత్రతో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని అల్లరి నరేష్ వెల్లడించాడు.
ప్రస్తుతం టాలీవుడ్లో 40-50 మంది హీరోలున్నారని.. పోటీ తీవ్రంగా ఉందని.. ఐతే విలన్ పాత్రలు చేసే వాళ్లు తక్కువున్నారని.. డిమాండ్ కూడా ఎక్కువుందని అందుకే తన అన్నయ్య విలన్ పాత్ర చేయాలనుకుంటున్నాడని నరేష్ తెలిపాడు. ప్రస్తుతం ఆర్యన్ రాజేష్ విలన్ పాత్రల కోసం ట్రైన్ అవుతున్నాడని.. బాడీ బిల్డింగ్ కూడా చేస్తున్నాడని నరేష్ వెల్లడించాడు. భవిష్యత్తులో తాను హీరోగా.. అన్నయ్య విలన్ గా సినిమా కూడా ఉండొచ్చని నరేష్ తెలిపాడు. 2002లో ‘హాయ్’ సినిమాతో పరిచయమైన ఆర్యన్ రాజేష్ తర్వాతి పదేళ్లలో ‘ఎవడిగోల వాడిది’ రూపంలో ఏకైక హిట్ అందుకున్నాడు. అది కూడా అతడికంటూ ఏమీ పేరు తేలేకపోయింది. చివరగా అతను తన తండ్రి దర్శకత్వంలో ‘బురిడీ’ సినిమాలో నటించాడు.