Begin typing your search above and press return to search.

కెమెరా ఉంద‌ని చెల‌రేగిపోతోందిగా

By:  Tupaki Desk   |   8 Feb 2022 3:30 AM GMT
కెమెరా ఉంద‌ని చెల‌రేగిపోతోందిగా
X
అందానికి అందం ప్ర‌తిభ కొంద‌రికే వ‌రం. అలాంటి అరుదైన అంద‌గ‌త్తె ప్ర‌తిభావ‌నిగా కీర్తి సురేష్ తెలుగు లోగిళ్ల‌లో పాపుల‌రైంది. సాంప్ర‌దాయం వీడి హ‌ద్దు మీరి ఇష్టానుసారం గ్లామ‌ర్ ఒల‌క‌బోత కీర్తికి తెలియ‌దు. న‌టి మేన‌క వార‌సురాలిగా ప్ర‌తిభ‌తో రాణించిన ఈ బ్యూటీ ఇప్ప‌టికీ కెరీర్ ప‌రంగా బిజీగా ఉంది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో సోద‌రి పాత్ర‌లో క‌నిపించేందుకు కూడా కీర్తి సురేష్ వెన‌కాడ‌డం లేదు.

ప్ర‌స్తుతం ఈ బ్యూటీ మ‌హేష్ స‌ర‌స‌న నాయిక‌గా న‌టిస్తూనే.. మ‌రోవైపు చిరంజీవి భోళా శంక‌ర్ లో సోద‌రి పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ రెండు సినిమాలు త‌న‌కు పెద్ద ప్ల‌స్ అవుతాయ‌ని కీర్తి భావిస్తోంది. చిరు లాంటి సీనియ‌ర్ కి సోద‌రిగా మ‌హేష్ లాంటి ఛామింగ్ హీరోకి గాళ్ ఫ్రెండ్ గా న‌టించాల‌న్న ఆలోచ‌నతోనే కీర్తి మార్కులు కొట్టేసింది. మునుముందు వెట‌రన్ హీరోల‌తో ఇలాంటి అవ‌కాశాల్ని అందుకుంటూనే యువ‌హీరోల స‌ర‌స‌నా క‌థానాయిక‌గా న‌టించ‌నున్నాన‌ని సంకేతాల్ని పంపింది. ఇక మ‌హాన‌టిగా త‌న‌కు ఉన్న ఇమేజ్ ని దెబ్బ తీయ‌కుండానే కీర్తి ప్ర‌తిదీ ప్లాన్ చేస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇక ఇటీవ‌లి కాలంలో సాటి నాయిక‌ల‌తో పోటీప‌డుతూ వ‌రుస ఫోటోషూట్ల‌ను సోష‌ల్ మీడియాల్లో కీర్తి షేర్ చేస్తోంది. ఇవ‌న్నీ వైర‌ల్ గానూ మారుతున్నాయి. తాజాగా కీర్తి మ‌రో ట్రెడిష‌న‌ల్ లుక్ లో త‌న అభిమానుల ముందుకు దూసుకొచ్చింది. దీనికి కీర్తి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఇచ్చింది. నెవ్వ‌ర్ లుక్ బ్యాక్.. అన్ లెస్ దేర్ ఈజ్ ఏ కెమెరా.. ! అంటూ కోట్ చేసింది. నిజ‌మే అస‌లు కెమెరా క‌నిపిస్తే ఆగ‌నే ఆగ‌దు కీర్తి. అందుకే ఇంత‌గా ఎదిగింద‌ని అనుకోవ‌చ్చు.

హిట్టిచ్చిన నానీతో ద‌స‌రా పండ‌గ‌!

కీర్తి సురేష్ నాని స‌ర‌స‌న `దసరా`లో న‌టిస్తోంది. ఇందులో మునుపెన్నడూ చూడని డి- గ్లామరస్ పాత్రలో కనిపించనుంది. నానిలాగే కీర్తి కూడా తన అద్భుతమైన మేకోవర్ తో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేయ‌నుందిట‌. ఆద‌ర్ బ్యాక్డ్ స్టోరీల్లో అద్భుత పాత్ర‌ల్లో న‌టించిన కీర్తి ఇప్పుడు `దసరా`లోనూ అద్భుత పాత్ర‌తో అల‌రించ‌నుంద‌ని స‌మాచారం. ఇంత‌కుముందు నానీ స‌ర‌స‌న నేను లోక‌ల్ లో న‌టించి హిట్టందుకున్న సంగ‌తి తెలిసిందే.