Begin typing your search above and press return to search.
మనసుకి నచ్చే సక్సెసే వేరయా -చౌదరి
By: Tupaki Desk | 24 Aug 2015 6:03 PM GMTయజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి విజయవంతమైన చిత్రాల్ని తెరకెక్కించాడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి. ప్రస్తుతం భవ్య క్రియేషన్స్ పతాకంపై గోపిచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈనెల 25న పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పాడు.
=సక్సెస్ లు వస్తుంటాయి కానీ, మనసుకు నచ్చే సక్సెస్ వేరు. పిల్లా నువ్వులేని జీవితంతో అది ఆస్వాధించా. ఈ చిత్రం తెరకెక్కించేప్పుడు చాలా సమయం వృథా అయ్యింది. అందుకే ఈసారి అలా కాకుండా తక్కువ సమయంలో సినిమాలు తీయాలనుకున్నా. నా కథైనా, వేరొకరి కథైనా సినిమా తీయాల్సిందే అనుకున్నా.
=యజ్ఞం తర్వాత గోపిచంద్ తో పదేళ్లకు సినిమా చేస్తున్నా. ఇది డబుల్ ఎంటర్ టైనర్. పెద్ద హిట్టవుతుంది. సగం పైగా చిత్రీకరణ పూర్తయింది. ఎడిటింగ్ కూడా పూర్తయింది. గోపీ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తీస్తున్న సినిమా. 80శాతం వినోదానికే పెద్దపీట. ఎమోషన్ హైలైట్ గా ఉంటుంది. భారీ కాస్టింగ్ అంటే 40మంది నటీనటులున్నారు.
=సినిమా కళాత్మకమే కాదు వ్యాపారం కూడా. నాతో సినిమాలు చేయాలంటే సక్సెస్ ముఖ్యం. ఆడియెన్ కూడా అదే కావాలని అనుకుంటాడు. సక్సెస్ కాంబినేషన్ వ్యాపారానికి కలిసొస్తుంది.
=చెప్పేది సింపుల్ పాయింట్ అయినా దానిని ఎలా చెబుతున్నామన్నది ముఖ్యం. పిల్లా నువ్వులేని... చిత్రానికి నేను చేసింది అదే. పాయింట్ నచ్చింది. స్క్రీన్‌ప్లే బావుంది అంటూ ఫోన్ లు చేశారు.
=సుకుమార్ తో స్నేహం వల్ల జగడంలో చేశాను. మద్దినేని రమేష్ అడగడం వల్ల బ్రోకర్ లో నటించా. అంతే తప్ప నటనలో కొనసాగాలని లేదు.
=ఓ యంగ్ హీరోతో సినిమా చేస్తున్నా. జనవరి 20న ప్రారంభోత్సవం. సాయిధరమ్ తో, కళ్యాణ్ రామ్ తో సినిమాలు చేస్తున్నా. త్వరలో వివరాలు చెబుతా.