Begin typing your search above and press return to search.
చీప్ పబ్లిసిటీతో విమర్శల పాలైన 'భాగమతి' నటి
By: Tupaki Desk | 6 July 2019 8:31 AM GMTఅనుష్క నటించిన 'భాగమతి' చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన ఆశా శరత్ తాజాగా ఒక సినిమా ప్రమోషన్ కోసం పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవ్వడం.. ఆ తర్వాత అది జోక్ అంటూ చెప్పడంతో విమర్శల పాలయ్యింది. విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా న్యూసెన్స్ కేసును కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది.
పూర్తి విషయం ఏంటంటే.. ఫేస్ బుక్ లో ఆశా శరత్ తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేసింది. తన భర్త గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆయన ఆచూకి తెలిసిన వారు కట్టప్పన్ పోలీసు స్టేషన్ లో తెలియజేయాల్సిందిగా కోరింది. ఆమె చాలా బాధతో మేకప్ లేకుండా వీడియోలో కనిపించింది. దాంతో అంతా కూడా ఆ వీడియో నిజమే అనుకున్నారు. ఆ వీడియో నిమిషాల్లో వైరల్ అయ్యింది. దాదాపుగా 15 లక్షల మంది ఆ వీడియోను చూశారు.
వీడియో ఫుల్ వైరల్ అవ్వడంతో పాటు పరిస్థితి చేయి దాటి పోతుందనే ఉద్దేశ్యంతో ఆశా శరత్ తాను అలా చెప్పింది 'ఎవిడే' సినిమా ప్రమోషన్ నిమిత్తం అని.. తన భర్త ఎటు పోలేదు అంటూ అసలు విషయం చెప్పి నవ్వు నవ్వేసింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో కొందరు ఆమె వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా పబ్లిసిటీ కోసం ఇలాంటి చెత్త ట్రిక్స్ ప్లే చేయవద్దంటూ హెచ్చరించారు. చీప్ పబ్లిసిటీ కోసం ప్రాకులాడవద్దంటూ మరి కొందరు సలహా ఇచ్చారు. జనాలను సోషల్ మీడియా ద్వారా మోసం చేసిందంటూ ఒక లాయర్ ఆశా శరత్ పై ఏకంగా న్యూసెన్స్ కేసును పెట్టాడు. కొసమెరుపు ఏంటంటే మీడియాలో ప్రస్తుతం ఆశా శరత్ పై తీవ్ర విమర్శలు రావడంతో పాటు ఆమె కోరుకున్నట్లుగా 'ఎవిడే' సినిమాకు కూడా మస్త్ పబ్లిసిటీ దక్కింది.