Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్ ఎమిగోస్ తో కన్నడ బ్యూటీ ఎంట్రీ..!

By:  Tupaki Desk   |   25 Dec 2022 4:19 AM GMT
కళ్యాణ్ రామ్ ఎమిగోస్ తో కన్నడ బ్యూటీ ఎంట్రీ..!
X
బింబిసార సక్సెస్ నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో సరికొత్త జోష్ తెచ్చింది. తానొక ప్రొడ్యూసర్ కాబట్టి రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీస్తూ హిట్ కొట్టడం చాలా ఈజీ కానీ అలా చేయడు. తను నిర్మించే సినిమాలే ఎక్కువ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించాలని ప్రయత్నిస్తుంటాడు కళ్యాణ్ రామ్. బింబిసార తర్వాత రెండు భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు ఈ నందమూరి హీరో. అందులో ఒకటి మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న అమిగోస్. ఈ సినిమా నుంచి ఆమధ్య వచ్చిన ఒక పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగేలా చేసింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ అషికా రంగనాథ్ ని తీసుకున్నారు. కన్నడ పరిశ్రమలో ఇప్పటికే ఆమె మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ తన సహజ నటనతో ఆకట్టుకుంటూ వరుస క్రేజీ ఛాన్స్ లు అందుకుంటున్న అషికా రంగనాథ్ తెలుగులో కళ్యాణ్ రాం అమిగోస్ సినిమాతో ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో ఆమె ఇషిక పాత్రలో నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబందించి హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది. అందుకే కావాలని అషికాని సెలెక్ట్ చేశారట.

ప్రస్తుతం కన్నడలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న అషిక తెలుగు ఎంట్రీకి చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా ఒక మంచి సినిమాతో రావాలని అనుకున్నదట. ఫైనల్ గా అమిగోస్ లో తన పాత్ర నచ్చి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను రాజేంద్ర రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ త్రిపుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయని తెలుస్తుంది. హీరో, హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ చిన్నగా తన స్టార్డం ని పెంచుకుంటున్నాడు. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ సినిమాల వెయిట్ పెరిగింది. కరెక్ట్ సినిమా పడితే కళ్యాణ్ రామ్ కూడా ఎక్కడో ఉంటాడని తనకు తానే ప్రూవ్ చేసుకున్నాడు. అందుకే రిస్క్ అనిపించినా సరే తన ప్రొడక్షన్ లో సినిమాలు చేసి తన స్టామినా చూపిస్తున్నాడు.