Begin typing your search above and press return to search.

కొత్త బ్యూటీని దించబోతున్న నందమూరి హీరో

By:  Tupaki Desk   |   9 Nov 2022 2:30 PM GMT
కొత్త బ్యూటీని దించబోతున్న నందమూరి హీరో
X
నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న అమిగోస్ సినిమా ఇటీవలే ఫస్ట్‌ లుక్ వచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెల్సిందే. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ చాలా విభిన్నంగా ఉండటం వల్ల సినిమా గురించిన చర్చ ఒక వర్గం ప్రేక్షకుల్లో జరుగుతోంది.

ఇక కళ్యాణ్ రామ్ గత చిత్రం బింబిసార సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం తో పాటు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతున్న కారణంగా అమిగోస్ పై అంచనాలు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా బాగానే ఉన్నాయి.. విడుదల సమయంకు ఆ అంచనాలు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కళ్యాణ్ రామ్‌ కు జోడీగా ఈ సినిమా లో కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్‌ నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ కన్నడ బ్యూటీ ఇప్పటికే కన్నడం లో దాదాపుగా పది సినిమాలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. త్వరలోనే తెలుగు లో ఈ అమ్మడు కళ్యాణ్ రామ్‌ కు జోడీగా నటించడం ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుంది.

తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ అమ్మడు అందం మరియు ఫిజిక్ ఉంటుందని.. అందుకే తెలుగు లో ఈ అమ్మడు తప్పకుండా స్టార్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకుంటుందనే నమ్మకంను మైత్రి మూవీ మేకర్స్ వారు వ్యక్తం చేస్తున్నారు.

అమిగోస్ సినిమా లో కళ్యాణ్ రామ్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్న విషయం తెల్సిందే. మరి మూడు పాత్రలకు ముగ్గురు హీరోయిన్స్‌ ఉంటారా లేదంటే ఈ ఒక్క కన్నడ బ్యూటీతోనే అమిగోస్ సినిమాను నడిపిస్తారా అనేది చూడాలి. కన్నడం నుండి దిగుమతి అవ్వబోతున్న ఈ అమ్మడికి అమిగోస్ విడుదలకు ముందే ఆఫర్స్‌ వచ్చేలా ఉన్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.