Begin typing your search above and press return to search.
ఆ ముగ్గురిలో ఎవరు గొప్ప డాన్సర్ అనేది చెప్పలేం!
By: Tupaki Desk | 21 Jan 2022 3:27 AM GMTఅశోక్ గల్లా కథానాయకుడిగా సంక్రాంతికి 'హీరో' సినిమా వచ్చింది. ఆయన సొంత బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా .. థియేటర్లో రన్ అవుతూ ఉంది. ఈ సందర్భంగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్ గల్లా మాట్లాడుతూ .. 'శ్రీరామ్ నాకు ఈ కథను వినిపించినప్పుడే .. చాలా కమర్షియల్ గా చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఈ సినిమా మొదటి నుంచి చివరివరకూ నవ్విస్తూనే ఉండేలా తీయాలనుకుంటున్నానని అన్నాడు. ఆయన ఇంతకుముందు చేసిన సినిమాలు చూశాను .. ఆ నమ్మకంతో నేను ఓకే చెప్పేశాను.
మొదటి నుంచి కూడా సినిమాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ .. దాంతో సినిమాల్లో చేయాలని గట్టిగానే డిసైడ్ అయ్యాను. ఈ సినిమాలో చేసిన సీనియర్ ఆరిస్టులు ఎవరూ కూడా నన్ను ఒక కొత్త హీరోలా చూడలేదు. అందువలన నేను కామెడీ కూడా బాగా చేయగలిగాను. నేను చెన్నైలో డాన్స్ నేర్చుకున్నాను. ఇక ఈ సినిమాకి ముందుగానే విజయ్ మాస్టర్ నాతో డాన్స్ ప్రాక్టీస్ చేయించాడు. నేని ఏ స్థాయికి డాన్స్ చేస్తానో తెలుసుకుని, ఆ రేంజ్ లోనే డాన్స్ చేయించాడు. అల్లు అర్జున్ .. ఎన్టీఆర్ .. చరణ్ ముగ్గురూ కూడా మంచి డాన్సర్లు. ఆ ముగ్గురిలో ఎవరు బెస్ట్ అనేది మాత్రం చెప్పడం కష్టం.
చరణ్ డాన్స్ లో ఒక గ్రేస్ ఉంటుంది .. ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన నాచురల్ డాన్సర్ .. ప్రాక్టీస్ లేకపోయినా ఆయన ఇరగదీసేస్తారు. బన్నీగారు ఇక మనం చూడని స్టెప్పులను కూడా ఎక్కడి నుంచో తెచ్చిపెడతారాయన. సుధీర్ బాబు మాత్రం ఒకసారి ఫిక్స్ అయిన తరువాత ఎంత కష్టమైనా పడతారు. నా సినిమాకి వచ్చేసరికి హార్స్ రైడింగ్ చేయడానికే నేను కాస్త కష్టపడ్డాను. అది అంతకుముందు అలవాటు లేకపోవడం వలన. మహేశ్ మావయ్య గతంలో నాతో ఎలా ఉండేవారో ఇప్పుడు కూడా నాతో అలాగే ఉంటారు.
మహేశ్ మావయ్య అందరి పైనా సెటైర్లు వేస్తుంటారు. నేను చిన్నవాడిని గనుక నా గురించి ఏమీ అనేవారు కాదు. రమేశ్ మావయ్యతో కూడా చాలా చనువుగా ఉండేవాడిని. మహేశ్ మావయ్య సినిమాల సక్సెస్ చూసి ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యేవారు. అలాంటి ఆయన నా సినిమాను చూడకుండానే వెళ్లిపోవడం మా అందరికీ బాధను కలిగించే విషయమే. ఇక ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. అందుకు వాళ్లందరికీ కూడా నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ప్రస్తుతం మరో స్క్రిప్ట్ పై వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఆ విషయాలను చెబుతాను" అంటూ ముగించాడు.