Begin typing your search above and press return to search.
ఆ సినిమా ఆగిపోవడానికి కారణమదేనట!
By: Tupaki Desk | 9 Jan 2022 1:30 PM GMTబలమైన సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీస్ నుంచి కొత్త హీరోలు రావడమనేది చాలా కాలం నుంచి జరుగుతున్నదే. సినిమా నేపథ్యం అనేది ఎంట్రీ వరకే ఉపయోగ పడుతుంది. ఆ తరువాత ఎవరకి వారు తమని తాము మార్చుకుంటూ .. మలుచుకుంటూ ముందుకు వెళ్లవలసిందే .. స్టార్ డమ్ తెచ్చుకోవలసిందే. ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్ .. చరణ్ .. బన్నీ .. ప్రభాస్ .. మహేశ్ అలా నిలదొక్కుకున్నవారే. కంటెంట్ ఉన్నవారికే ఇక్కడ కటౌట్లు పెడతారని నిరూపించినవారే. వారి బాటలోనే ఇప్పుడు సూపర్ కృష్ణ మనవడు .. మహేశ్ మేనల్లుడు గల్లా అశోక్ 'హీరో'గా ఎంట్రీ ఇస్తున్నాడు.
అశోక్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నట్టుగా కొంతకాలం క్రితమే వార్తలు వచ్చాయి. దిల్ రాజు నిర్మాతగా ఒక సినిమా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. దిల్ రాజు బ్యానర్ ద్వారా పరిచయమవుతుండటంతో అందరికి ఒక రకమైన ఆసక్తి ఏర్పడింది. అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్టు చేయడం లేదని దిల్ రాజు ప్రకటించారు. దాంతో ఏం జరిగిందనేది ఎవరికీ తెలియలేదు. ఈ విషయంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. చివరికి అశోక్ గల్లా సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని 'హీరో' సినిమాతో రంగంలోకి దిగవలసి వచ్చింది.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేస్తున్నారు. అశోక్ జోడీగా నిధి అగర్వాల్ నటించిన ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ముందుగా దిల్ రాజుతో అనుకున్న సినిమా ఎందుకు ఆగిపోయిందనే ప్రశ్న, తాజా ఇంటర్వ్యూలో అశోక్ కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఆ సినిమా కోసం అనుకున్న కథకి కాస్త ఏజ్ ఎక్కువున్న హీరో కావాలి. ఆ కథకి నేను సరిపోనని అనిపించింది. అందరూ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో ఆ సినిమాను ఆపేయడం జరిగింది.
ఇక నేను రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం కానున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదు. ముందు నుంచి దర్శకుడిగా శ్రీరామ్ ఆదిత్యనే అనుకున్నాము. ఆయన వినిపించిన కథ మాకు బాగా నచ్చింది. ఇందులో నేను సినిమాలో హీరోను కావాలనుకుని కలలు కనే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిలా కనిపిస్తాను. నా పాత్రలో వేరియేషన్స్ బాగుంటాయి. నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం ఉన్న కథ ఇది. అందువల్లనే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయింది. ఈ పాత్ర నాకు మంచి పేరు తెస్తుంది .. ఈ సినిమా నన్ను నిలబెడుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు.