Begin typing your search above and press return to search.
'ఆచార్య' కు భయపడకుండా బరిలో దిగుతున్న మాస్ కా దాస్..!
By: Tupaki Desk | 15 April 2022 5:30 PM GMTమాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ''అశోక వనంలో అర్జున కళ్యాణం''. విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విశ్వక్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
నిజానికి 'అశోక వనంలో అర్జున కళ్యాణం' చిత్రాన్ని ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇదివరకు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాని మరో వారం రోజులు ముందుకు షిఫ్ట్ చేస్తూ.. సరికొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
'అశోక వనంలో...' మూవీని ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలిపింది. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ పొలాల్లో నడుస్తూ వస్తోన్న ఓ ఆసక్తికరమైన పోస్టర్ ని వదిలారు.
అయితే విశ్వక్ సినిమాకు 'ఆచార్య' రూపంలో పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో రూపొందిన ఈ చిత్రం.. ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మెగా తండ్రీకొడుకులు కలిసొస్తున్నా సరే.. యంగ్ హీరో విశ్వక్ ఏమాత్రం భయపడకుండా బరిలో దిగుతున్నారు.
అలానే విజయ్ సేతుపతి - నయనతార - సమంత కలిసి నటించిన 'కణ్మణి రాంబో ఖతీజా' అనే డబ్బింగ్ మూవీ కూడా ఈ నెలాఖరునే రాబోతోంది. ఏప్రిల్ 28న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద 'ఆచార్య' వంటి భారీ చిత్రాన్ని ఎదుర్కొని ఈ రెండు సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.
కాగా, మూడు పదుల వయసు దాటినా.. పెళ్లి కాని వ్యక్తి కథాంశంతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఇందులో అల్లం అర్జున్ కుమార్ గా విశ్వక్ సేన్.. పసుపులేటి మాధవి పాత్రలో రుస్కర్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి.
బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్ పై బాపినీడు - సుధీర్ ఈదర కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'రాజా వారు రాణి వారు' ఫేమ్ రవి కిరణ్ కోలా దీనికి కథ - స్క్రీన్ ప్లే - మాటలు అందించారు. జై క్రిష్ సంగీతం సమకూర్చారు. పవి కె పవన్ సినిమాటోగ్రఫీ అందించగా.. విప్లవ్ ఎడిటింగ్ వర్క్ చేసారు.